అన్వేషించండి

యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై కాంగ్రెస్ కీలక భేటీ, యాక్షన్ ప్లాన్ ఫైనల్ చేయనున్న సోనియా

Congress on UCC: యూసీసీపై యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలో కాంగ్రెస్ ప్రత్యేక భేటీతో ఫైనల్ చేయనుంది.

Congress on UCC: 

కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం..

యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై కేంద్రం స్పీడ్ పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. వర్షాకాలం సమావేశాల్లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అంతకు ముందు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై డిస్కస్ చేయనుంది. అయితే...అటు కాంగ్రెస్ మాత్రం ఈ కోడ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోనియా గాంధీ కీలక నేతలతో ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ మరో కీలక భేటీ నిర్వహించనున్నారు సోనియా గాంధీ. పార్లమెంట్‌లో ప్రస్తావించిన అంశాలపై చర్చించడంతో పాటు యునిఫామ్ సివిల్‌ కోడ్ బిల్ ప్రవేశపెడితే ఏం చేయాలన్నదీ డిస్కస్ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. జులై 3వ తేదీన ప్రత్యేకంగా యూసీసీ గురించే చర్చించేందుకు మరోసారి సమావేశం అవనున్నారు. ఆ రోజు ఏమేం చర్చించాలి..? యూసీసీపై ఎలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి..? అనే అంశాలపై వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగడం వల్ల UCCని ఆ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందని అర్థమవుతోంది. ఇది కేవలం మైనార్టీలను అణిచివేసేందుకే అని ప్రచారం చేసి ఎంతో కొంత బీజేపీకి డ్యామేజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు విపక్షాలూ వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు యూసీసీ అందుకు కారణం కానుంది. 

పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్..!

యూనిఫామ్ సివిల్ కోడ్‌ (UCC) బిల్‌ని ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇదే విషయం చెబుతున్నాయి. జులైలో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కేబినెట్ కమిటీ మీటింగ్‌లో డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...Uniform Civil Code Bill ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనుంది. దీనిపై అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటుంది. ఆ తరవాతే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ దీనిపై ప్రకటన చేసినప్పటి నుంచే విపక్షాలు మండి పడుతున్నాయి. ఇక పార్లమెంట్‌లో బిల్‌ని తీసుకొస్తే ఇంకెంత వాగ్వాదం జరుగుతుందో చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌తో సహా పలు ముస్లిం సంఘాలు UCCని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే...లా కమిషన్,కేంద్ర న్యాయ శాఖకు చెందిన ప్రతినిధులతో జులై 3వ తేదీన పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు ఇప్పటికే వాళ్లకు కబురు పంపింది. జులై మూడో వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇవి జరగనున్నాయి. చాలా రోజులుగా దీనిపై వాగ్వాదం నడుస్తున్నప్పటికీ...ప్రధాని మోదీ ప్రకటనతో అది మరింత ముదిరింది. ముఖ్యంగా ముస్లిం సంఘాలు దీనిపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తున్నాయి. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బట్టే అది అర్థమవుతోంది. కాంగ్రెస్‌ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది.

Also Read: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- కదిలే బస్‌లో మంటలు, 25 మంది సజీవదహనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget