By: ABP Desam | Updated at : 17 Jul 2023 08:21 PM (IST)
మళ్లీ ఎన్డీఏలో చేరిన చిరాగ్ పాశ్వాన్ ( Photo Credit: Twitter)
Chirag Paswan Rejoins NDA: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నేతలు రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ క్రమంలో లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ మళ్లీ ఎన్డీఏలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమైన అనంతరం తాను తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే నేడు, రేపు ప్రతిపక్షాలు బెంగళూరులో కీలక భేటీ కాగా, మంగళవారం 38 పార్టీలు పాల్గొననున్న కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సమావేశానికి ఒక రోజు చిరాగ్ చేరికతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
श्री @iChiragPaswan जी से दिल्ली में भेंट हुई। उन्होंने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में शामिल होने का निर्णय लिया है। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ। pic.twitter.com/vwU67B6w6H
— Jagat Prakash Nadda (@JPNadda) July 17, 2023
2020లో బిహార్‌లో రాజకీయాల పరిణామాలతో ఎన్డీఏ కూటమి నుంచి ఎల్ జే పీ వైదొలగింది. ఆ సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్న సీఎం నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ (జేడీయూ) కి వ్యతిరేకంగా పాశ్వాన్ కేంద్రంలో అధికార కూటమి ఎన్డీఏ నుంచి వైదొలిగారు.
లోక్ జనశక్తి పార్టీ అగ్రనేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎల్‌జేపీలో చీలిక రావడం తెలిసిందే. చిరాగ్ పాశ్వాన్ మేనమామ పశుపతి కుమార్ పరాస్ తన వర్గీయులతో పార్టీని వీడారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రి అయ్యారు. అయితే చిరాగ్ పాశ్వాన్ తాను ప్రధాని నరేంద్ర మోదీకి హనుమంతుడు లాంటి సేవకుడ్ని అన్నారు. ప్రతి క్లిష్ట పరిస్థితిలో బీజేపీకి మద్దతుగా నిలిచానని గుర్తుచేసుకున్నారు. అయితే ప్రచారానికి తనకు ప్రధాని మోదీ ఫొటోలు అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన హృదయంలోనే ఉన్నారని.. తాను ఆయనకు హనుమాన్ లాంటి వాడినని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ తన మాజీ మిత్రులను కూటమిలో చేరాలని ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో బిహార్‌లో తన పార్టీ లోక్‌సభ సీట్ల వాటాపై చర్చించేందుకు చిరాగ్ పాశ్వాన్ సోమవారం హోం మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశానని భేటీ అనంతరం పావ్వాన్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ గతంలో పాశ్వాన్‌తో రెండు సార్లు భేటీ కావడం తెలిసిందే. ఎల్జేపీ వర్గాలుగా చీలక ముందు 2019లో ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీతో సీట్ల ఒప్పందంలో భాగంగా రాజ్యసభ స్థానాన్ని సైతం పొందింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
Viral News: సంచలనం, తల్లి డెడ్ బాడీతో ఏడాది పాటు ఇంట్లో ఉన్న అక్కాచెల్లెల్లు
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ ఫ్యూచర్‌ని డిసైడ్ చేయనున్నాయా? I.N.D.I.A కూటమి సంగతేంటి?
Bengaluru Schools: 15 పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు, వణికిపోయిన విద్యార్థులు
Latest Gold-Silver Prices Today 01 December 2023: మళ్లీ పెరిగిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌బీఐ
/body>