Chandrayaan 3: అత్యంత రహస్యంగా చంద్రుడి దక్షిణ ధృవం, అక్కడ ఎలా ఉంటుందంటే!
Why Moons south pole important to land : సౌత్ పోల్ మీద ల్యాండర్ దింపాలనుకున్న ప్రతీసారి ఎందుకు సైంటిస్టుల్లో వణుకు మొదలవుతుంది. అమెరికా, చైనాలు చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రయోగాలు చేయలేదు.
Why Moons south pole important to land : రష్యా లూనా 25 ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఇస్రో పంపిన చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం చంద్రయాన్ 2 అనుభవంతో తాజా మిషన్ ను సక్సెస్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను దింపాలన్న ప్రయోగాలు ఎందుకు విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019లో చంద్రయాన్ 2, ప్రస్తుతం రష్యా లూనా 25 ఫెయిలయ్యాయి. సౌత్ పోల్ మీద ల్యాండర్ దింపాలనుకున్న ప్రతీసారి ఎందుకు సైంటిస్టుల్లో వణుకు మొదలవుతుంది. వాస్తవానికి అమెరికా నాసాకు, సోవియట్ యూనియన్ కు, చైనా కు చంద్రుడి ల్యాండర్ ను దింపిన అనుభవం ఉంది. కానీ ఈ మూడు కూడా ల్యాండర్ ను దింపింది నార్త్ పోల్ దగ్గరే. చంద్రుడి సౌత్ పోల్ (South Pole of Moon) దగ్గర ల్యాండర్ ను దింపాలన్న ఆలోచన కూడా చేయలేదు మిగిలిన దేశాలు.
జాబిల్లి దక్షిణ ధృవంపై ఎలాగైనా సరే మిషన్ ను ల్యాండ్ చేయాలన్న టాస్క్ ను భారత్ ముందుగా తలకెత్తుకుంది. చంద్రయాన్ 1 తో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రయాన్ 2 మాడ్యూల్ లో పంపి సౌత్ పోల్ మీద దింపాలనుకున్నా అది సాధ్యం కాలేదు. చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ కావటంతో అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రధాని మోదీని పట్టుకుని మరీ వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనను ఎవరూ మర్చిపోలేరు.
ఇప్పుడు రష్యా కూడా ఎంతో అనుభవం ఉన్నా చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను దింపలేకపోయింది. అంతరిక్ష ప్రయోగాలన్నీ ఎప్పుడూ కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ మోడ్ లోనే జరుగుతాయి. కానీ చంద్రుడి సౌత్ పోల్ సంగతి వేరు.చంద్రుడు ఒకే నిర్దిక్ష కక్ష్యలో భూమి చుట్టూ గిరగిరా తిరుగుతుండటంతో చంద్రుడి సౌత్ పోల్ మిస్టీరియస్ గా మారింది. చంద్రుడి మీద ఉత్తర ధృవం దగ్గర పగలు సమయంలో ఉష్ణోగ్రత 54 డిగ్రీలవరకూ ఉంటే... దక్షిణ ధృవంలో రాత్రి సమయాల్లో అది -203 డిగ్రీలవరకూ ఉంటూ కఠిన పరిస్థితులను తలపిస్తూ ఉంటుంది.
సౌత్ పోల్ దగ్గర్లోని కొన్ని క్రేటర్స్ లో అయితే బిలియన్ల సంవత్సరాలుగా సూర్యరశ్మి సోకనే లేదు. అక్కడి ఉపరితలంపై ఉన్న పరిస్థితులు భూమి ఏర్పడిన నాటి పరిస్థితులను వివరించగలవని శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. ఎందుకంటే మార్స్ సైజులో ఉన్న ఓ గ్రహాన్ని భూమి ఏర్పడినప్పుడు బలంగా ఢీకొట్టిన కారణంగానే భూమి నుంచి విడిపోయిన ఓ భాగం గ్రావిటీ కారణంగా చంద్రుడిగా మారి ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతారు.
చంద్రుడిపై సురక్షిత ల్యాండింగ్ కోసం అణ్వేషణ చేస్తూ, సురక్షిత ప్రాంతాన్ని గుర్తించే క్రమంలో లాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా(LHDAC) తీసిన ఫొటోలను సోమవారం ఉదయం ఇస్రో విడుదల చేసింది. ఈ కెమెరా ద్వారా బండరాళ్లు, లోయలు, కందకాలు లేని ప్రదేశంలో ల్యాండర్ దిగేందుకు ఇస్రో ఈ కెమెరాను అభివృద్ధి చేసింది.