By: Ram Manohar | Updated at : 02 Sep 2023 03:41 PM (IST)
చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్లు ప్రయాణించిందని ఇస్రో ప్రకటించింది. (Image Credits: ISRO)
Chandrayaan-3 Updates:
100 మీటర్ల ప్రయాణం..
ఆదిత్య L1 ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో చంద్రయాన్ 3 గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఓ కీలక మైలురాయిని దాటిందని ప్రకటించింది. చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్ల మేర ప్రయాణించిందని వెల్లడించింది. ఇంకా అదే జోష్‌తో తిరుగుతోందని తెలిపింది. "ప్రజ్ఞాన్ 100" అంటూ ఓ ట్వీట్ చేసింది. రోవర్‌ని మరో రెండు రోజుల్లో స్లీప్ మోడ్‌లో పెడతామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు.
"చంద్రుడిపైన ప్రజ్ఞాన్ రోవర్ దూకుడు మీదుంది. 100 మీటర్లు ప్రయాణించింది. ఇంకా ప్రయాణిస్తూనే ఉంది"
- ఇస్రో
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 2, 2023
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
ఆడుకుంటున్న రోవర్..
చంద్రయాన్ 3 కి సంబంధించి రోజుకో ఆసక్తికర అప్‌డేట్ షేర్ చేస్తున్న ఇస్రో...ఇటీవలే ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ వీడియోని షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై రోవర్ అటూ ఇటూ కదులుతున్న వీడియోని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోవర్ 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. సేఫ్ రూట్‌ని చూసుకుంటూ ముందుకు కదులుతుండటాన్ని గమనించవచ్చు. ఇందులో రోవర్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోపై ఇస్రో చాలా పొయెటిక్‌గా స్పందించింది. రోవర్ చంద్రుడిపై తిరుగుతుంటే చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటున్నట్టుగా ఉందని ట్వీట్ చేసింది.
"సేఫ్ రూట్ కోసం రోవర్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఈ వీడియోని రికార్డ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఓ చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటుంటే తల్లి ఆ పిల్లాడిని చూస్తూ సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది"
- ఇస్రో
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 31, 2023
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.
It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp
EAM Jaishankar: ఇప్పటికీ ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమే- పశ్చిమ దేశాల తీరుపై జైశంకర్ చురకలు
సనాతన ధర్మాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది, ఉదయనిధిపై కాంగ్రెస్ నేత ఫైర్
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సర్‌ప్రైజ్ ఇస్తాం, తెలంగాణ సహా అన్నిచోట్లా గెలుస్తాం - రాహుల్ గాంధీ
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
/body>