అన్వేషించండి

Chandrayaan 3: ఉలుకు పలుకు లేని చంద్రయాన్ ల్యాండర్, రోవర్ - సన్నగిల్లుతున్న ఇస్రో ఆశలు!

Chandrayaan 3: చంద్రుడిపై రోజులు గడిచేకొద్ది చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.

Chandrayaan 3: చంద్రుడిపై రోజులు గడిచేకొద్ది చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.  చంద్రుడిపై సూర్యరశ్మి తగ్గడంతో రోవర్, ల్యాండర్లు రెండింటిని ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపంది. సెప్టెంబర్ 2 శనివారం రోజు సేఫ్ గా పార్క్ చేసి, స్లీప్ మోడ్ లోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది. రోవర్ లోని పేలోడ్లను ఆఫ్ చేసి, రిసీవర్ ను మాత్రం ఆన్ చేసి ఉంచినట్లు తెలిపింది. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అయింది. అప్పటి నుంచి స్లీప్ మోడ్‌లో ఉన్న రోవర్ ప్రజ్ఞాన్, లాండర్ విక్రమ్‌తో శాస్త్రవేత్తలు అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. 

శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపింది.

ఇన్ని ప్రయత్నాలు చేసినా అయితే రోవర్ ప్రజ్ఞాన్, లాండర్ విక్రమ్‌ నుంచి ఎటువంటి స్పందన లేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు. చంద్రుడిపై సూర్యోదయం అవడంతో ఎలక్ట్రానిక్ యంత్రాలు శీతల పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగితే మరో సారి సంచలనాత్మక అన్వేషణను తిరిగి ప్రారంభించగలదని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో ఇస్రో కమ్యూనికేషన్‌ ఏర్పరచగలిగితే ఇస్రో చరిత్ర సృష్టించినట్లే. దీనిపై ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని అభివర్ణించారు. 

జూలై 14, 2023న ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ఇప్పటికే గణనీయమైన మైలురాళ్లను సాధించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాయి. చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్... చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. ప్రజ్ఞాన్ రోవర్ లోని లిబ్స్ గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ స్ట్రుమెంట్ సహాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో. 

అన్నింటికంటే ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవంపై సల్ఫర్ నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అంత కంటే అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలను కూడా గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, సిలికాన్, టైటానియం నిల్వలను ధృవీకరించింది.  హైడ్రోజన్‌ను సైతం వెతికే పనిలో ఉన్నామని ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దానికి సంబంధించిన రెస్పాన్స్ వేల్ లెంత్ గ్రాఫ్ ను విడుదల చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
Dilsukhnagar Blasts Verdict: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
Allu Arjun - Jr NTR:
"హ్యాపీ బర్త్ డే బావా"... ఎన్టీఆర్ స్పెషల్ విషెష్... బన్నీ కోసం తారక్ ఏం కోరుకున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Batting vs MI IPL 2025 | ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో దుమ్మురేపిన కింగ్ కొహ్లీMI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయంTilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్Hardik Pandya vs Krunal Pandya MI vs RCB | IPL 2025 లో మంచి మజా ఇచ్చిన అన్నదమ్ముల సవాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
Dilsukhnagar Blasts Verdict: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
Allu Arjun - Jr NTR:
"హ్యాపీ బర్త్ డే బావా"... ఎన్టీఆర్ స్పెషల్ విషెష్... బన్నీ కోసం తారక్ ఏం కోరుకున్నాడో తెలుసా?
IPL 2025 MI VS RCB Updates:  వాటి వ‌ల్లే వ‌రుస ఓట‌ములు.. రోహిత్ కి ఫామ్ దొర‌కాలంటే ఆలా ఆడాలి.. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే
వాటి వ‌ల్లే వ‌రుస ఓట‌ములు.. రోహిత్ కి ఫామ్ దొర‌కాలంటే ఆలా ఆడాలి.. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే
Jio Unlimited Offer: ఫ్రీగా జియో హాట్‌స్టార్‌, ఫ్రీగా జియో ఫైబర్‌ - ఆఫర్‌ గడువు పొడిగించిన జియో
ఫ్రీగా జియో హాట్‌స్టార్‌, ఫ్రీగా జియో ఫైబర్‌ - ఆఫర్‌ గడువు పొడిగించిన జియో
A22 x A6 Movie: అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ అదుర్స్... అట్లీతో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ అదుర్స్... అట్లీతో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
Pawan Kalyan Son Injured: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
Embed widget