By: Ram Manohar | Updated at : 29 Sep 2023 12:58 PM (IST)
తమిళనాడుకి కావేరి జలాలు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో బంద్‌కి పిలుపునిచ్చారు. (Image Credits: ANI)
Cauvery Water Dispute:
జల వివాదం..
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం మరింత ముదురుతోంది. తమిళనాడుకి నీళ్లు ఇచ్చేదే లేదని పట్టుబడుతోంది కర్ణాటక. రాష్ట్ర అవసరాలు తీర్చుకోడానికే సరిపోవడం లేదని, వాటిని ఆ రాష్ట్రానికి విడుదల చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదిస్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కర్ణాటక ఆందోళనకారులంతా ఇవాళ (సెప్టెంబర్ 29) బంద్ ప్రకటించారు. తమిళనాడుకి కావేరీ నదీ జలాలు విడుదల చేసేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే పలు చోట్ల నిరసనలు మొదలయ్యాయి. కన్నడ సంస్థలకు చెందిన 50 మందికి పైగా ఆందోళనకారులు పలుచోట్ల తమిళనాడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణాకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లు నడవడం లేదు. క్యాబ్‌లు, ఆటోలు తిరగడం లేదు.హోటల్స్, స్కూల్స్, కాలేజీలూ బంద్ అయ్యాయి. బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చాయి కన్నడ సంస్థలు. ఇది దృష్టిలో ఉంచుకుని బెంగళూరు, మాండ్య ప్రాంతాల్లో విద్యా సంస్థల్ని మూసివేశారు.
#WATCH | Pro-Kannada outfits in Karnataka's Hubballi stage protest over the Cauvery water release to Tamil Nadu. pic.twitter.com/V8nLFNzg47
— ANI (@ANI) September 29, 2023
బెంగళూరులో 144 సెక్షన్
బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. షాప్‌లు, మాల్స్‌తో పాటు మిగతా వాణిజ్య సంస్థలూ మూసేశారు. థియేటర్లూ బంద్ అయ్యాయి. పలు చోట్ల రహదారులను నిరసనకారులు అడ్డగించారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. ఈ బంద్‌కి అనుమతి లేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ తేల్చి చెప్పారు. సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. అనవసరపు ఆందోళనలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరు మెట్రో సర్వీస్‌లపై ఈ బంద్ ప్రభావం కనపించ లేదు. రాష్ట్ర రవాణా సంస్థ బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి. తమిళనాడుతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
#WATCH | Karnataka: Pro-Kannada outfits hold protest on Cauvery water sharing issue in Freedom Park, Bengaluru. pic.twitter.com/WrTUYt2rEX
— ANI (@ANI) September 29, 2023
తమిళనాడు, కర్ణాటక మధ్య 200 ఏళ్లుగా కావేరీ నదీజలాల వివాదం కొనసాగుతోంది. 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కర్ణాటకకు అదనంగా 14.75 TMCల నీళ్లు విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు వాటాని అదే స్థాయిలో తగ్గించింది. బెంగళూరు సిటీలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక రీసోర్స్ ఈ కావేరి నదీ జలాలే. అంతే కాదు. కర్ణాటకలోని మాండ్యలో వ్యవసాయ భూములకూ ఈ నీరే ఆధారం. అయితే...దీనిపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇది బయటపడింది. ఇక్కడ రాష్ట్రాల వాదన ఏంటంటే...2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్పనిసరే. కానీ...ఇది సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది వర్షపాతం 30% మేర తక్కువగా నమోదైంది. అలాంటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాలంటే ఎలా అని కర్ణాటక వాదిస్తోంది. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!
Ashwini Vaishnaw: 2026లో దూసుకెళ్లనున్న తొలి బుల్లెట్ రైలు
Anju Nasrullah: ఇండియాలో అడుగుపెట్టిన అంజు, ఎందుకంటే?
Latest Gold-Silver Prices Today 30 November 2023: భారీగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
RRC SER: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!
Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!
Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్
Airtel Vs Jio: నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?
/body>