అన్వేషించండి

Justin Trudeau: ఎట్టకేలకు కెనడాకు తిరిగి వెళ్లిపోయిన జస్టిన్ ట్రూడో, 36 గంటల పాటు ఆలస్యం

Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు తిరిగి కెనడాకు తిరిగి వెళ్లిపోయారు.

Justin Trudeau: ఎట్టకేలకు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో దేశాన్ని విడిచి కెనడాకు బయల్దేరారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రధాని ట్రూడో 36 గంటలు ఆలస్యంగా భారత్ ను విడిచారు. మంగళవారం నాడు నిపుణులు ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో విమానం బయల్దేరింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. శని, ఆదివారాల్లో రెండ్రోజుల పాటు సదస్సు అనంతరం కెనడాకు తిరిగి వెళ్లాల్సి ఉంది. ట్రూడో తన విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం కారణంగా తన బసను పొడిగించాల్సి వచ్చింది. 

జీ 20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కొద్దిసేపు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కెనడా సిక్కు వేర్పాటు వాదులకు ఆశ్రయమిస్తోందని మోదీ విమర్శలు చేశారు. కెనడా నుంచి కొన్ని గ్రూపులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, అది ఆందోళనకరంగా ఉందని మోదీ ట్రూడోతో తన అభిప్రాయం వెల్లడించారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాంటి వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్‌ సిండికేట్స్‌, మానవ అక్రమరవాణా చేసే గ్రూప్స్‌తో కెనడాకు కూడా నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి వాటిని ఎదుర్కోవడంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం చాలా అవసరమని మోదీ సూచించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే మోదీ, ట్రూడో మధ్య అధికారికంగా ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. కానీ చిన్న మీటింగ్‌లో పాల్గొన్నారు. చర్చల్లో విదేశీ జోక్యం, చట్టాలను గౌరవించడం అంశాల గురించి మాట్లాడినట్లు ట్రూడో తెలిపారు.

సిక్కు వేర్పాటువాదులు సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కెనడాలో ఓ రెఫరెండం నిర్వహించారు. తమ కమ్యునిటీ వారు మెజార్జీగా ఉన్న భారత్‌లోని ప్రాంతాలు స్వతంత్రంగా ఉండాలా వద్దా అని అక్కడి ప్రవాసులను అభిప్రాయం తెలియజేయాలని అడిగారు. జూన్‌ నెలలో కెనడాలోని ఒట్టావా నగరంలో హైకమిషన్‌ కార్యాలయం ఎదుట సిక్కు వేర్పాటు వాదులు నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. అక్కడి ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీ దీనిని దాడిగా పరిగణించి దర్యాప్తు చేస్తోంది. పంజాబ్ వేర్పాటువాదులు కెనడాలో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఎప్పటి నుంచో భారత అధికారులు ఆరోపిస్తున్నారు.

అయితే కెనడా గత వారం తమ దగ్గర జరిగిన జాతీయ ఎన్నికల్లో విదేశాల జోక్యంపై బహిరంగ విచారణను ప్రారంభించింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలపై ఫోకస్‌ చేసింది. అయితే కెనడాలో విదేశీ జోక్యానికి భారత్‌ ప్రధాన కారణమని ట్రూడో జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కెనడాలో పంజాబ్‌ వేర్పాటువాదుల అంశం, అలాగే కెనడా వ్యవహారాల్లో భారత్‌ జోక్యం అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు ట్రూడో తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ, తప్పొప్పులు నిర్ణయించుకునే స్వేచ్ఛ, శాంతియుత నిరసనను కెనడా ఎల్లప్పుడూ సమర్థిస్తుందని, అది తమకు చాలా ముఖ్యమైన విషయమని ట్రూడో దిల్లీలో ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే తాము హింసను నిరోధించడానికి, ద్వేషానికి తగ్గించడానికి ముందుంటామని అన్నారు. కొద్ది మంది చేసే చర్యలు కెనడాకు, అక్కడి సమాజం మొత్తానికి వర్తించదని గుర్తుంచుకోవాలని అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget