అన్వేషించండి

Byju's: ప్రజలను, సిబ్బందినీ బైజూస్ మోసం చేస్తోంది- కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఓ ఉద్యోగి రిక్వస్ట్‌

Byju's: తనను రాజీనామా చేయాలని బైజూస్ సంస్థ ఒత్తిడి చేస్తోందంటూ ఓ ఉద్యోగిని లింక్డ్‌ఇన్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

Byju's: అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉవ్వెత్తున ఎగిసి ఎంతో మందికి, స్టార్టర్ నిపుణులకు, అంకుర సంస్థల అధినేతలకు ఆదర్శంగా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండ్రోజుల క్రితం ఆ సంస్థ సీఈవో, బైజూస్ వ్యవస్థాపకుడు.. బైజూస్ రవీంద్రన్ గా పేరు సంపాదించుకున్న రవీంద్రన్.. తన కంపెనీ పతనంపై కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి కష్టం, కంటెంట్, ప్లానింగ్ తో 22 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగిన బైజూస్.. కొన్ని పరిపాలనాపరమైన తప్పుల వల్ల అథఃపాతాళానికి పడిపోయింది. కరోనా తర్వాత విద్యా సంస్థలన్నీ తెరచుకోవడంతో మొదలైన కష్టాలు.. రోజు రోజుకూ పెరిగి పెద్దవై కంపెనీని ముంచెత్తాయి. ఈ క్రమంలో కాస్ట్ కటింగ్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. అయితే తాజాగా ఓ ఉద్యోగిపై ఉన్నతాధికారులు రాజీనామా చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న వ్యవహారంతో మరోసారి ఈ ఎడ్ టెక్ కంపెనీ వార్తల్లో నిలిచింది.

ఆకాంక్ష ఖేమ్కా గత ఒకటిన్నర సంవత్సరంగా బైజూస్ లో అకడమిక్ స్పెషలిస్టుగా పని చేస్తోంది. ఈ ఉద్యోగమే తన జీవనాధారం. కుటుంబాన్ని పోషించడం పూర్తిగా తన ఉద్యోగంపైనే ఆధారపడి నడుస్తోంది. ఇలాంటి సమయంలో తనను ఉద్యోగం నుంచి రాజీనామా చేయాలంటూ తన ఉన్నతోదోగ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని తన లింక్డ్‌ఇన్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసింది. వేరియబుల్స్, లీవ్స్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను కూడా చెల్లించలేదని, కానీ తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన కుటుంబంలో తను మాత్రమే సంపాదిస్తున్నానని, తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని, తీర్చాల్సిన అప్పులు ఉన్నాయని, బైజూస్ సంస్థ తనకు జీతం ఇవ్వకపోతే ఎలా బతకాలంటూ కన్నీరు మున్నీరు అయింది. 

ఈ విషపూరిత పని సంస్కృతి నుంచి తమను ప్రభుత్వమే రక్షించాలని, తనతో పాటు ఇతర ఉద్యోగులకు కూడా సహాయం చేయాలని ఆ వీడియోలో అభ్యర్థిచింది. బైజూస్ సంస్థ ఉద్యోగులను, కస్టమర్లను అందరినీ మోసం చేస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. 

అష్టకష్టాలంటే ఇవే..

ఏళ్ల తరబడి కష్టం, కంటెంట్‌, ప్లానింగ్‌తో ఎవరెస్ట్‌ స్థాయికి ఎదిగిన బైజూస్, అక్కడి నుంచి పడిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కరోనా కాలంలో హైయెస్ట్ లెవల్‌కు వెళ్లి, తన పతనాన్ని అక్కడి నుంచే స్వహస్తాలతో రాసుకుంది. ఫారిన్‌ పెట్టుబడులు, లాభాలు వరదలా వచ్చి పడేసరికి, ఆ డబ్బును అక్రమంగా దాచుకోవడానికి బైజూస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ అడ్డదార్లు తొక్కిందని రూమర్లు ఉన్నాయి. దీంతో, ఈ ఏడాది ఏప్రిల్ చివరలో, బైజూస్‌ బెంగళూరు ఆఫీస్‌ మీద సెంట్రల్‌ గవర్నమెంట్‌ తనిఖీలు చేశారు. ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదు గానీ, అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయింది.

2022, 2023 ఆర్థిక సంవత్సరాల ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ను ఈ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కంపెనీ గవర్నెన్స్‌ సరిగా లేకపోవడం, పెట్టుబడులు పెట్టి డైరెక్టర్ల సీట్లలో కూర్చున్న వాళ్ల మాటలు పట్టించుకోకపోవడంతో బైజూస్‌ నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ ప్రకటించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందనే కారణంతో, ఈ సంస్థ ఆడిటింగ్‌ కంపెనీ 'డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్', గత నెలలో తప్పుకుంది. బైజూస్‌ బోర్డ్‌లో మెంబర్లుగా ఉన్న పీక్ XV, ప్రోసస్ NV, చాన్-జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ప్రతినిధులు కూడా అదే వారంలో బైజూస్‌ బోర్డ్‌కు రిజైన్‌ చేశారు. ఐదు లక్షల డాలర్లను బైజూస్‌ దాచి పెట్టిందని ఆరోపిస్తూ కేసులు కూడా పెట్టారు.

బైజూస్ అకౌంట్‌ బుక్స్‌ను క్షుణ్నంగా పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Corporate Affairs Ministry) ఇటీవల ఆర్డర్‌ పాస్‌ చేసినట్లు సమాచారం. ఆరు వారాల్లోగా రిపోర్ట్ సబ్మిట్‌ చేయాలని ఆదేశించినట్లు కూడా మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget