Manipur Violence: ఇదంతా విపక్షాల షో ఆఫ్ మాత్రమే, ఎంపీల మణిపూర్ పర్యటనపై కేంద్రమంత్రి సెటైర్లు
Manipur Violence: ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ సెటైర్లు వేస్తోంది.
Manipur Violence:
బెంగాల్‌లో హింస కనిపించలేదా: అనురాగ్ ఠాకూర్
INDIA కూటమికి చెందిన 21 మంది ఎంపీలు మణిపూర్ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇదంతా షో ఆఫ్ కోసమే అని సెటైర్లు వేసింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కాస్త ఘాటుగానే స్పందించారు. విపక్షాల ఎంపీలు ముందు బెంగాల్, రాజస్థాన్‌కి వెళ్తే బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించాలని తేల్చి చెప్పారు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఎంత హింస జరిగిందో కనిపించలేదా అని మండి పడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్రిమినల్స్‌కి ఆశ్రయమిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆమె సీఎం పదవి నుంచి దిగిపోయే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
"మణిపూర్‌కి వెళ్లిన ఎంపీలది కేవలం షోఆఫ్ మాత్రమే. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా మణిపూర్‌లో ఇలాంటి అల్లర్లు చెలరేగాయి. అప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రానికి వెళ్లి హడావిడి చేస్తున్నారు. వాళ్లు మణిపూర్ నుంచి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి బెంగాల్‌కి వెళ్లి పర్యటించాలని నా విజ్ఞప్తి. అక్కడ పరిస్థితులనూ సమీక్షించాలని కోరుకుంటున్నాను. రాజస్థాన్‌లో మహిళలపై ఎలా దాడులు జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలి. ఇండియా కూటమి ఎంపీలు రాజస్థాన్‌కి కూడా వెళ్తారో లేదో చెప్పాలి"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
#WATCH | West Bengal: Union Minister, Information & Broadcasting and Youth Affairs, Anurag Thakur arrives at Kolkata airport, says, "It is just a showoff by the INDIA alliance MPs who have gone to Manipur. The opposition & its allies never spoke when Manipur used to burn during… pic.twitter.com/qOVGA8VN8a
— ANI (@ANI) July 29, 2023
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన INDIA కూటమి ఎంపీలు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ, రేపు ( జులై 29,30) అక్కడే పర్యటిస్తారు. ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి అక్కడ చేరుకోనున్నారు. ఈ కూటమిలోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు వెళ్తున్నారు. అక్కడి పరిస్థితులు సమీక్షిస్తారు. కాంగ్రెస్ తరపున అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్ వెళ్తున్నారు. ఆప్ నుంచి సుశీల్ గుప్తా, డీఎమ్‌కే నుంచి కనిమొళి కరుణానిధి వెళ్లనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ పర్యటనను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని, కేవలం మణిపూర్ పౌరుల ఆవేదనను అర్థం చేసుకోడానికే వెళ్తున్నామని ఇప్పటికే INDIA స్పష్టం చేసింది. ఎంపీలు మణిపూర్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆ తరవాత రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయ్కేని కలవనున్నారు. ఈ పర్యటన ముగిసిన తరవాత మణిపూర్‌లో తాము ఏం గమనించారో పార్లమెంట్లో చర్చించాలని భావిస్తున్నారు.
Also Read: Viral News: స్విగ్గీలో ఫ్రూట్స్ ఆర్డర్, అవి దానిమ్మ గింజలా? నెయిల్ పాలిష్ ఉండలా?