By: Ram Manohar | Updated at : 29 Sep 2023 04:47 PM (IST)
ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మనేకా గాంధీకి ఆ సంస్థ రూ.100కోట్ల పరువునష్టం దావా నోటీసులు పంపింది.
Maneka Gandhi:
రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మనేకా గాంధీకి ఆ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు ఆమెకి నోటీసులు కూడా పంపింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయని వెల్లడించింది. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆమె అసత్య ఆరోపణలు చేశారని మండి పడింది. అందుకే పరువు నష్టం దావా వేస్తున్నట్టు వివరించింది.
"ఇస్కాన్‌పై అసత్య ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మనేకా గాంధీకి రూ.100 పరువు నష్టం దావా వేశాం. ఆమెకి నోటీసులు పంపించాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థలో ఎంతో మంది భక్తులు, మద్దతుదారులున్నారు. వాళ్లంతా ఈ వ్యాఖ్యలతో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల మనోభావాలు దెబ్బ తినేలా మనేకా గాంధీ మాట్లాడారు. ఇవి మా ప్రతిష్ఠకి భంగం కలిగించేలా ఉన్నాయి. ఇస్కాన్‌పై ఈ విద్వేష ప్రచారాన్ని మేం ఏ మాత్రం సహించం. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం"
- రాధారమణ్ దాస్, వైస్ ప్రెసిడెంట్, కోల్‌కత్తా ఇస్కాన్
#WATCH | West Bengal | On BJP MP Maneka Gandhi's remark, Vice-President of ISKCON Kolkata, Radharamn Das says, "The comments of Maneka Gandhi were very unfortunate. Our devotees across the world are very hurt. We are taking legal action of defamation of Rs 100 Crores against her.… pic.twitter.com/wLkdrLLsVd
— ANI (@ANI) September 29, 2023
ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇస్కాన్ ప్రతినిధులు మండి పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గోమాతలను రక్షించేందుకు తాము ఎన్నో చర్యలు చేపడుతున్నామని తేల్చి చెప్పారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవే అని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ మనేకా గాంధీ ఇస్కాన్ (ISKCON)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థ ప్రజల్ని మోసం చేస్తోందని, గోశాలల్లోని ఆవులను కసాయి వాళ్లకి అమ్మేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేశాయి ఈ కామెంట్స్. ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సంపాదిస్తోందని, భూములనూ కొల్లగొడుతోందని ఆరోపించారు మనేకా గాంధీ.
"ఇస్కాన్ సంస్థ దేశ ప్రజల్ని మోసం చేస్తోంది. గోశాలలను ఏర్పాటు చేస్తోంది. వాటి నుంచి బాగా సంపాదిస్తోంది. ప్రభుత్వం నుంచీ పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటోంది. భూమలనూ సంపాదించుకుంటోంది. ఆ తరవాత ఆ గోశాలల్లోని ఆవులను కసాయి వాళ్లకి అమ్మేస్తోంది. ఈ మధ్యే ఏపీలోని అనంతపూర్ గోశాలకు వెళ్లాను. అక్కడ ఒక్క ఆవు కూడా ఆరోగ్యంగా లేదు. ఒక్క దూడ కూడా కనిపించలేదు. అంటే ఆవులను కసాయి వాళ్లకు అమ్ముతున్నారనేగా అర్థం. ఇస్కాన్ అమ్మినంతగా దేశంలో మరెవరూ ఆవుల్ని ఇలా అమ్ముకోరు. కానీ మళ్లీ వాళ్లే రోడ్లపైకి వచ్చి హరేరామ హరేకృష్ణ అని భజనలు చేస్తారు"
- మనేకా గాంధీ, బీజేపీ ఎంపీ
Also Read: 2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?
IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా
ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి
AIIMS Bibinagar: బీబీనగర్ ఎయిమ్స్‌లో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Live-in relationship: సహజీవనం, ప్రేమ పెళ్లిలను నిషేధించేలా చట్టం చేయాలి - లోక్‌సభలో బీజేపీ ఎంపీ డిమాండ్
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>