(Source: ECI/ABP News/ABP Majha)
Case On MLA: ఎమ్మెల్యేతో మూడేళ్లుగా రిలేషన్‌షిప్, పెళ్లి పేరుతో మోసం! - మహిళ సంచలన ఆరోపణలు
BJD MLA News: శుక్రవారం పెళ్లి చేసుకొనేందుకు మహిళ తన కుటుంబంతో సహా రిజిస్ట్రర్ ఆఫీసుకు చేరుకున్నప్పటికీ, ఎమ్మెల్యే విజయ్ శంకర్ దాస్ మాత్రం అక్కడికి రాలేదు.
ఎమ్మెల్యే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా ముహూర్తం సమయానికి మొహం చాటేశాడని ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. శనివారం (జూన్ 18) జరగాల్సి ఉన్న తమ వివాహానికి ఎమ్మెల్యే రాలేదని ఓ యువతి ఆరోపించింది. ఒడిశాలోని బీజేడీ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్‌పై ఈ మేరకు కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒడిశాలోని తిర్టోల్ ఎమ్మెల్యే దాస్‌పై కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్లు 420 (మోసం), 195ఎ (ఎవరికైనా తప్పుడు సాక్ష్యం చెబుతామని బెదిరించడం), 294 (అశ్లీల చర్యలు), 509 పై కేసులు పెట్టినట్లుగా పోలీసులు సాహు తెలిపారు.
ఎఫ్ఐఆర్ పేర్కొన్న వివరాల ప్రకారం, మే 17న వివాహ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహిళ, ఎమ్మెల్యే దరఖాస్తు చేసుకున్నారు. 30 రోజుల సమయం దాటిన శుక్రవారం వివాహ లాంఛనాల కోసం మహిళ తన కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నప్పటికీ, ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ మాత్రం రాలేదు.
ఎమ్మెల్యే దాస్‌తో తనకు మూడు సంవత్సరాల నుంచి సంబంధం ఉందని, గడువులోపు పెళ్లి చేసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని ఆ మహిళ ఆరోపించింది. కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే సోదరుడు, కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని అన్నారు. అతను తన మాటను నిలబెట్టుకోలేదని, తన ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వడం లేదని మహిళ ఆరోపించారు.
అయితే, ఈ అంశంపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఆ మహిళను పెళ్లి చేసుకోనని తాను తేల్చిచెప్పలేదని, పెళ్లి కోసం రిజిస్టర్ చేయించుకున్న 60 రోజుల్లోగా వివాహం చేసుకోవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, “వివాహ రిజిస్ట్రేషన్‌కు 60 రోజుల సమయం ఉంది. అందుకే, నేను రాలేదు.’’ అని అన్నారు.