Bihar Election Result: లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తప్పని టెన్షన్.. 4వ స్థానంతో వెనుకంజ
Mahua Seat Result 2025: మహువా నుంచి పోటీ చేసిన తేజ్ ప్రతాప్ 4వ స్థానంలో ఉన్నారు. ఎల్జేపీఆర్ నుండి సంజయ్ కుమార్ సింగ్, ఆర్జేడీ నుండి ముఖేష్ కుమార్, ఆర్జేడీ నుండి తేజ్ ప్రతాప్ పోటీలో ఉన్నారు.

Bihar Election 2025 Result: బిహార్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్లలో మహువా ఒకటి. ఎందుకంటే బిహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్ Janshakti Janata Dal నుంచి పోటీ చేశారు. మహువా సీటులో ఉదయం 11 గంటల వరకు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి చెందిన సంజయ్ కుమార్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. దాంతో మహాకూటమికి ఇక్కడ సైతం షాక్ తగిలేలా కనిపిస్తోంది.
అదే స్థానంలో రాష్ట్రీయ జనతా దళ్‌కు చెందిన ముఖేష్ రోషన్ రెండో స్థానంలో ఉన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు చెందిన అమిత్ కుమార్ మూడో స్థానంలో, జనశక్తి జనతాదళ్‌కు చెందిన తేజ్ ప్రతాప్ యాదవ్ నాల్గవ స్థానంలో ఉన్నారు.
11 గంటల వరకు ట్రెండ్స్
సంజయ్ కుమార్ సింగ్ - 12897 (ఆర్జేడీ)
ముఖేష్ కుమార్ రోషన్ - 8794
అమిత్ కుమార్ - 4569
తేజ్ ప్రతాప్ యాదవ్ - 2121
తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటులో వరుసగా గెలుస్తానని చెప్పుకున్నారు. అయితే ఎర్లీ ట్రెండ్‌లలో అందుకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ విజయం సాధించాలని లాలూ కుటుంబ సన్నిహితులు ఆకాంక్షించారు. అయినా తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ అందరినీ వెనక్కి నెట్టి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
2015లో మహువా నుంచి గెలిచిన తేజ్ ప్రతాప్ యాదవ్
తేజ్ ప్రతాప్ యాదవ్ ఈసారి తన సీటును మార్చుకున్నారు. ఎన్నికలకు ముందు ఆర్జేడీ అతన్ని పార్టీ నుంచి బయటకు పంపింది. తేజ్ ప్రతాప్ కోసం ఈ రెండు విషయాలు చాలా కష్టంగా కనిపిస్తున్నాయి. 2020లో తేజ్ ప్రతాప్ హసన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈసారి మహువా నుంచి పోటీ చేశారు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఈ సీటు కొత్తేమీ కాదు. 2015లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది, ఇందులో కమిషన్ నిబంధనల ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించారు. ఈవీఎంల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరిగింది. మహువా సీటులో మొదటి దశలో భాగంగా నవంబర్ 6న ఓటింగ్ జరిగింది.






















