India Vs Canada: MEA spokes person says canada becoming safe haven terrorists amid tensions
రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు అనుగుణంగా ఆన్ లైన్ లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. జేబులో క్యాష్ లేకున్నా ప్యాకెట్‌లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటర్నెట్ వినియోగం దగ్గర నుంచి పేమెంట్స్ వరకు అన్ని ఆన్ లైన్‌లోనే జరుగుతున్నాయి. జాబ్ వేకెన్సీ కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు. క్యాష్ కోసం బ్యాంకుకు వెళ్లే పనిలేదు. ఇలా ఒకటి రెండు కాదు చాటింగ్ దగ్గర నుంచి షాపింగ్ వరకు ఇలా ప్రతీ పని ఆన్ లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. టెక్నాలజీపై అవగాహన లేకపోతే అంతే సంగతి.
తెలియక అమాయకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో తమకు తెలియకుండానే పెద్దమొత్తంలో జేబులు గుల్లవుతున్నాయి.
కాబోయే భార్య అని నమ్మితే నట్టేట ముని చేసింది. దీంతో ఆయన నమ్మిన వ్యక్తి చివరకు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.... సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆదాయ మార్గాలకు కొదవ లేకుండా పోయింది. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించుకుంటున్నారు. అయితే ఇదే సోషల్ మీడియా ద్వారా కొందరు లక్షలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. ప్రస్తుత కాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించి వార్తలు మనం ప్రతిరోజు చూస్తుంటాం. తాజాగా ఇలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. కాబోయే భార్య కదా అని అతిగా నమ్మేశాడు. సీన్ కట్ చేస్తే కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.... బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాడు. ఇతడు తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా... ఇటీవల ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ తన వివరాలను నమోదు చేశాడు. దీంతో ఇటీవల అతడికి బెంగళూరుకు చెందిన ప్రగతి అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను కూడా రెండవ వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో రోజు చాటింగ్ చేసుకునే అంతగా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోని ఆమెను ఎంతగానో నమ్మాడు. చివరిగా అతని ఆశను అవకాశంగా తీసుకుంది.
ఓ రోజు అతనితో తాను ఆన్లైన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ప్లాట్ ఫార్మ్ లో పెట్టుబడి పెట్టినట్టు చెప్పింది. పెట్టిన పెట్టుబడికి 12 కోట్ల వరకు లాభం వచ్చిందని నమ్మబలికింది. దీంతో ఆమె మాటలు నమ్మిన వ్యక్తి ట్రేడింగ్ ప్లాట్ ఫార్మ్ లో 1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే ఈ క్రమంలో అతడి అకౌంట్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న ఆమె... అతన్ని అందులో నుంచి బ్లాక్ చేసి... చివరకు ఆ డబ్బులను తానే కొట్టేసింది. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
నమ్మి మోసపోవద్దు....
మ్యాట్రిమోనియల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు అనుగుణంగా ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి వెల్లడిస్తున్నారు. జేబులో క్యాష్ లేకుండా ప్యాకెట్లు స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్ వినియోగం దగ్గర నుంచి పేమెంట్స్ వరకు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయని... వీటిపై జాగ్రత్త వహించాలని పోలీసులు కోరుతున్నారు.
Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
/body>