పని మనుషులు కామన్ ఏరియాల్లో కనిపించొద్దని రూల్, హౌజింగ్ సొసైటీపై నెటిజన్లు ఫైర్
Housing Society: బెంగళూరులోని ఓ హౌజింగ్ సొసైటీలో పని మనుషులపై వింత ఆంక్షలు విధించడం వివాదాస్పదమవుతోంది.
Bengaluru Housing Society:
బెంగళూరులోని అసోసియేషన్‌లో రూల్..
బెంగళూరులోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్‌లో పని మనుషులపై వింత ఆంక్షలు పెట్టారు. పార్క్‌లు, లాన్‌లలో తిరగొద్దని తేల్చి చెప్పారు. వెయిటింగ్ ఏరియాల్లో మాత్రమే కనిపించాలని నిబంధన విధించారు. కామన్ ఏరియాల్లో పని మనుషులు ఉండటం వల్ల రెసిడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, సెక్యూరిటీకి కూడా సమస్యలొస్తున్నాయని ఆ అసోసియేషన్ వెల్లడించింది. "వంట మనుషులు, కార్పెంటర్‌లు, ప్లంబర్‌లు..ఇలా చాలా మంది వచ్చి రెసిప్షన్‌లోని సోఫాల్లో కూర్చుంటున్నారు. మా రెసిడెంట్స్ అంతా సోఫాల్లో కూర్చోడం ఎప్పుడో మానేశాం" అని చెప్పింది.
నోటీస్‌లో ఏముందంటే..
"పని మనుషులందరూ అసోసియేషన్‌లోని అన్ని బిల్డింగ్‌ల్లో ఉన్న వెయిటింగ్ రూమ్‌లో మాత్రమే ఉండాలి. పని మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అన్నీ ఇక్కడే. మీరు విశ్రాంతి తీసుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ కామన్ ఏరియాల్లో మీరు కనిపించడం వల్ల రెసిడెంట్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సెక్యూరిటీ కూడా సరైన విధంగా మానిటర్ చేయలేకపోతోంది"
residents of a bangalore society confusing class and being a classist🤮 pic.twitter.com/0pbeBUpDJc
— Vibin Babuurajan 👋 (@vibinbaburajan) June 21, 2023
ఈ నోటీస్‌ని సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేశారు. అప్పటి నుంచి ఆ అసోసియేషన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఫస్ట్ మూడు లైన్స్ చదివాక నాకు ఇందులో కాంట్రవర్సీ ఏం కనిపించలేదు. ఆ తరవాత మొత్తం చదివాక అర్థమైంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "వాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని వాళ్లు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు" అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. "అదే పని మనుషులు మీ ఇంట్లో తిరుగుతున్నారు. మీకు వంట చేసి పెడుతున్నారు. అంట్లు కడుగుతున్నారు. అదంతా తప్పు కానప్పుడు కామన్ ఏరియాల్లో కనిపించడం మాత్రం ఎలా తప్పవుతుంది..? ఇది చాలా దారుణం" అని మరొకరు కామెంట్ చేశారు.
Why is it so hard for people to understand that they are humans only
— Mehak Agrawal (@mehakagrawall) June 21, 2023
గ్రేటర్ నోయిడాలో ఇలా..
గ్రేటర్ నోయిడాలోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామన్ ఏరియాల్లో తిరిగేటప్పుడు కాస్త పద్ధతిగా డ్రెసింగ్ చేసుకోవాలని ఆదేశించింది. హిమ్సాగర్ అపార్ట్మెంట్లో ఈ రూల్ పెట్టారు. జూన్ 10వ తేదీన ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ కూడా జారీ చేశారు. చాలా మంది పార్కింగ్, కామన్ ఏరియాల్లో పురుషులు లుంగీలతో, మహిళలు నైటీలతో తిరుగుతుండటం సొసైటీ గమనించింది. ఇకపై ఇంకెప్పుడూ అలా కనిపించకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ఈ సర్క్యులర్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అవడమే కాదు...పోలీసుల వరకూ వెళ్లింది వ్యవహారం. నెటిజన్లైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. "పర్సనల్ ఛాయిస్ ఉండదా" అని తిట్టి పోస్తున్నారు. డ్రెస్ కోడ్ పేరుతో విడుదల చేసిన ఆ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
"ఈ సొసైటీలో మీరు ఎక్కడ తిరిగినా సరే మీ డ్రెసింగ్ ఎలా ఉందో ఓ సారి చూసుకోవడం మంచిది. మీ ప్రవర్తనతో పాటు డ్రెసింగ్ విషయంలోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కామన్ ఏరియాకి వచ్చినప్పుడు ఇంట్లో వేసుకునే లుంగీలు, నైటీలతో కనిపించడానికి వీల్లేదు. దయచేసి అర్థం చేసుకోండి"
- సర్క్యులర్
Also Read: బైక్ కాస్ట్ రూ.80 వేలు, కట్టాల్సిన చలానాలు రూ.70 వేలు - ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే అంతే మరి