అన్వేషించండి

Ram mandir inauguration: అయోధ్య రామ మందిరంలో మైసూర్‌ విగ్రహం- నేటి నుంచి ప్రాణ్‌ప్రతిష్ఠ ప్రక్రియ మొదలు

Ram Lalla Idol Created By Karnataka Sculptor: మైసూర్‌కు చెందిన శిల్పి చెక్కిన రామ్‌ లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టంచనున్నారు. ఈ మేరకు టెంపుల్ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ ప్రకటించారు.

Ram Temple Consecration Ceremony: మైసూర్‌కు చెందిన శిల్పి చెక్కిన రామ్‌ లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టంచనున్నారు. ఈ మేరకు టెంపుల్ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ ప్రకటించారు. అరుణ్‌ యోగిరాజు చెక్కిన రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టంచబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎంపికైన మూడు విగ్రహాల్లో అరుణ్ యోగిరాజు చెక్కింది అత్యద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. 

కొత్త విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువుతో సిద్ధం చేసినట్టు రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల బాలుడిగా ఉన్నట్టు రామ్‌లల్లా విగ్రహం ఉంటుందని అన్నారు. గత 70 ఏళ్లుగా పూజులు అందుకుంటున్న విగ్రహం కూడా దేవాలయంలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేటితో ప్రారంభం కానుంది. జనవరి 22న ముఖ్య ఘట్టం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఏడు వేలమందిని టెంపుల్‌ ట్రస్ట్‌ ఆహ్వానించింది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠతో వేడుక ప్రారంభంకానుంది. ఇవాల్టి నుంచి ఏడు రోజుల పాటు ప్రాణప్రతిష్ట జరగనుంది. Image

జనవరి 16
ఈరోజు ప్రాణప్రతిష్ఠ క్రతువులు ప్రారంభం కానున్నాయి. ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం  ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ జరగనుంది. 

జనవరి 17
రామ్ లల్లా విగ్రహం ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు.

జనవరి 18
గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు నిర్వహిస్తారు. 

జనవరి 19
యజ్ఞం ప్రారంబంకానుంది. తర్వాత 'నవగ్రహ' 'హవన్' స్థాపన జరుగుతుంది.

జనవరి 20
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో కడుగుతారు, ఆ తర్వాత వాస్తు శాంతి 'అన్నాధివాస్' ఆచారాలు జరుగుతాయి.

జనవరి 21
రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, చివరకు శంకుస్థాపన చేస్తారు.

జనవరి 22
ప్రధాన "ప్రాణ్‌ ప్రతిష్ఠ" వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.

జనవరి 21 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి భక్తులను రానివ్వరు. జనవరి 23 నుంచి దర్శన భాగ్యం కల్పిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget