తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటించిన ఎన్నికల సంఘం
Assembly Elections 2023 Date Live: 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ అధికారికంగా ఈ తేదీల్ని ప్రకటించారు. మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీనే ఫలితాలు వెల్లడించనున్నారు. డిసెంబర్ 5 తో మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
పోలింగ్ తేదీలు ఇలా..
మధ్యప్రదేశ్: నవంబర్ 17
రాజస్థాన్: నవంబర్ 23
ఛత్తీస్‌గఢ్ (రెండు విడతల్లో) : నవంబర్ 7, 17
తెలంగాణ: నవంబర్ 30
మిజోరం: నవంబర్ 7
ఫలితాల ప్రకటన : డిసెంబర్ 3
5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A
— ANI (@ANI) October 9, 2023
ఈ తేదీల ప్రకటనతో 5 రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. యువ ఓటర్ల నమోదుపై ఎక్కువగా దృష్టి సారించినట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్టు స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలున్నట్టు తెలిపారు. ఈ 5 రాష్ట్రాల్లో 40 రోజుల పాటు పర్యటించామని తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్. ఈ 5 రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లుండగా..వీరిలో 60 లక్షల మంది కొత్త ఓటర్లున్నారని చెప్పారు. పార్టీలు, ప్రభుత్వాధికారులతో చర్చించినట్టు వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్టు తెలిపారు. తెలంగాణలో 3.17కోట్ల మంది ఓటర్లున్నట్టు వెల్లడించారు. రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లున్నారని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి 897 మందికి ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మిజోరంలో 8.52 లక్షల మంది ఓటర్లున్నారు.
#WATCH | Chief Election Commissioner Rajiv Kumar announces schedule of elections to 5 State Legislative Assemblies of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana pic.twitter.com/Tsr2NVw5uj
— ANI (@ANI) October 9, 2023
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే
పోలింగ్ తేదీ- 30 నవంబర్ 2023
కౌంటింగ్ తేదీ- 3 డిసెంబర్ 2023
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్: 3 నవంబర్ 2023
ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ- 3 నవంబర్ 2023
ఎన్నికల నామినేషన్లకు తుది గడువు - 10 నవంబర్ 2023
నామినేషన్ల స్క్రూట్నీ తేదీ- 13 నవంబర్ 2023
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ- 15 నవంబర్ 2023