Assembly Election 2023 Date: ఆ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల తేదీలు వచ్చేశాయ్, ప్రకటించిన ఎన్నికల సంఘం
Assembly Election 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది.
Assembly Election 2023:
కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల తేదీలు వెల్లడించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎలక్షన్ డేట్స్‌ని ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నట్టు తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మార్చి నెలలోనే పూర్తి కానుంది. త్రిపురలో ప్రస్తుతానికి బీజేపీ అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) ప్రభుత్వం నడుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల్లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఒకే ఒక పార్టీ...నేషనల్ పీపుల్స్ పార్టీ. ప్రస్తుతం మేఘాలయాలో ఈ పార్టీయే అధికారంలో ఉంది.
Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 pic.twitter.com/TIzHye22Ng
— ANI (@ANI) January 18, 2023
Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq
— ANI (@ANI) January 18, 2023
త్రిపురలో 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మార్చి 22న అసెంబ్లీ గడువు పూర్తవనుంది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, కాంగ్రెస్‌కు మధ్య రాజకీయ వైరం చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఈ సారి ఈ రెండు పార్టీలు బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధమవు తున్నాయి. అయితే...కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒక్కటైతే మాత్రం బీజేపీకి కాస్త ఇబ్బందులు తప్పవు. 2018 ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మేఘాలయ సంగతి చూస్తే...ఇక్కడ బీజేపీ, ఎన్పీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ ఇక్కడ చాలా బలంగా ఉండేది. కానీ.. క్రమంగా పార్టీ క్యాడర్‌ను కోల్పోతూ వచ్చింది. ఇదే బీజేపీకి కలిసొచ్చింది. మేఘాలయాలోనూ 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2018లో ఇక్కడి ప్రజలు ఏ పార్టీకీ మెజార్టీ ఇవ్వలేదు. అందుకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు
గెలుచుకుంది. నాగాలాండ్‌లోనూ బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఎన్డీపీపీ, బీజేపీ ఈ సారి కూడా కలిసే పోటీ చేస్తామని ప్రకటించాయి. NDPP 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ రెండు పార్టీలు పరస్పరం సపోర్ట్ఇ చ్చుకుంటూ బలంగా నిలబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇక్కడ ఉనికి చాటుకోవడం కాస్త కష్టమే.