Terrorist Attack: అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి
మణిపూర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు మెరుపుదాడికి దిగారు.
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యం చేసుకుని.. ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్ అధికారి, ఆయన కుటుంబసభ్యులు సహా పలువురు జవాన్లు చనిపోయారు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని చురాచంద్ జిల్లా సింఘత్‌లో ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ వెళ్తుండగా.. కొందరు ముష్కరులు కాల్పులు, బాంబు దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్ కమాండింగ్ అధికారి విప్లవ్‌దేవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు నలుగురు జవాన్లు చనిపోయారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. విప్లవ్‌దేవ్ సెలవు ముగించుకుని తిరిగి యూనిట్‌లో చేరేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
Convoy of a Commanding Officer of an Assam Rifles unit ambushed by terrorists in Singhat sub-division of Manipur’s Churachandpur district. Family members of officer along with Quick Reaction Team were in convoy. Casualties feared. Ops underway, details awaited: Sources
— ANI (@ANI) November 13, 2021
Strongly condemn the cowardly attack on a convoy of 46 AR which has reportedly killed few personnel incl the CO & his family at Churachandpu today. State forces& Paramilitary already on their job to track down the militants. The perpetrators will be brought to justice: Manipur CM pic.twitter.com/z0bi8WN7TG
— ANI (@ANI) November 13, 2021
#UPDATE | 5 personnel of Assam Rifles and two of their family members lost their lives in an attack in Churachandpur, Manipur: Defence Minister Rajnath Singh pic.twitter.com/zfWDUeUk3b
— ANI (@ANI) November 13, 2021
Terrorists first carried out IED blast to ambush the convoy of 46 Assam Rifles Commanding Officer Colonel Viplav Tripathi & then fired at the vehicles in Churachandpur, Manipur. The officer was returning from his forward company base to his battalion headquarters: Army officials
— ANI (@ANI) November 13, 2021
Also Read: Breaking News: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Also Read: Drunk And Drive: ఊదమంటే ఊదేశావ్.. కానీ ఎందుకయ్యా.. ఇలా పేరు తప్పుగా చెప్పి మరో తప్పు చేశావ్