అన్వేషించండి

EPFO : ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌ కు మీరు అర్హులేనా ? ఇలా చెక్ చేసుకోండి !

ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్‌కు మీరు అర్హులేనా ? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా ?

 

EPFO :   ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద అధిక పెన్షన్‌ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని  ఈపీఎఫ్‌ఓ  విడుదల చేసింది.  2014 సెప్టెంబర్‌ 1నాటికి సర్వీసులో ఉన్నవారు, అటు తర్వాత సర్వీసులో కొనసాగుతున్నవారికి అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన 4 నెలల గడువు మరో రెండు వారాల్లో ముగిసిపోతున్నది. ఈ తరుణంలో హడావుడిగా ఉద్యోగులు, యాజమాన్యాలు అనుసరించాల్సిన విధివిధానాలను ఈపీఎఫ్‌ఓ జారీచేసింది.

ఈపీఎఫ్ఓ  అధిక పెన్షన్‌ పొందడానికి ఇవీ రూల్స్ ! 

 
ఈపీఎస్‌కు 2014లో చేసిన సవరణల మేరకు పెన్షనబుల్‌ వేతన పరిమితిని నెలకు రూ. 6,500 నుంచి రూ. 15,000 కు పెంచింది. ఈ పరిమితికి లోబడి అందులో 12 శాతం శాతాన్ని పలు యాజమాన్యాలు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌గా ఉద్యోగుల నుంచి  జమ చేస్తున్నారు. అంతే మొత్తం యాజమాన్యం సమకూరుస్తున్నది. యాజమాన్యం చెల్లించిన దానిలో 8.33 శాతం ఈపీఎస్‌కు మళ్లిస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు  బేసిక్‌+డీఏ పై ఉద్యోగుల నుంచి డిడెక్ట్‌ చేస్తూ, అంత మొత్తాన్ని అవి సమకూరుస్తున్నాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ? 

ఉద్యోగులు, వారి యాజమాన్యాలు ఉమ్మడిగా అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. ఇందుకు సంబంధించి ఒక ఆన్‌లైన్‌ సదుపాయాన్ని కల్పించారు.  ఈ యూఆర్‌ఎల్‌తో ఉద్యోగులు డిజిటల్‌గా లాగిన్‌ అయ్యి, దరఖాస్తును రిజిష్టర్‌ చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు రసీదు నంబరును కేటాయిస్తారు.ఉద్యోగి సమర్పించిన దరఖాస్తు యజమాని లాగిన్‌లోకి వెళుతుంది. దానిని యజమాని డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా ధృవీకరించడం తప్పనిసరి. ఈ విధంగా పీఎఫ్‌ కమిషనర్‌ నిర్దేశించిన ఫారంలో అధిక పెన్షన్‌ కోరుతూ ఉద్యోగులు వారి యాజమానితో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయాలి. జాయింట్‌ డిక్లరేషన్‌ తదితర డాక్యుమెంట్లను జతచేయాలి.  ప్రాంతీయ ప్రావిడెంట్‌ కార్యాలయం అధికారి దరఖాస్తులోని వాస్తవ వేతనంపై అధిక పెన్షన్‌ ఉమ్మడి ఆప్షన్‌ను పరిశీలించి నిర్ణయాన్ని దరఖాస్తుదారుకు ఈమెయిల్‌/పోస్ట్‌, తదుపరి ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తారు. ఉమ్మడి ఆప్షన్‌ ఫారం సమర్పించిన తర్వాత దరఖాస్తుదారు ఏమైనా ఫిర్యాదు చేయదలిస్తే ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ (గ్రీవియెన్స్‌ పోర్టల్‌)లో రిజిష్టర్‌ చేసుకోవచ్చు.అర్హమైన చందాదారులకు/ఉద్యోగులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను అందించాలంటూ ఈపీఎఫ్‌ఓ తన ఫీల్డ్‌ ఆఫీసర్లను అదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మరికొంత మందికి అవకాశం 

పెన్షన్‌బుల్‌ వేతన పరిమితిని మించి ఉన్న వాస్తవ వేతనంలో ఈపీఎస్‌కు 8.33 శాతం చెల్లించే అవకాశాన్ని 2014 స్కీమ్‌ కల్పించి, అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చని సూచించింది. 2014 సెప్టెంబర్‌ 1కి ముందు పదవీ విరమణ చేసిన వారు, వాస్తవ జీతంపై పీఎఫ్‌ డిడెక్ట్‌ అవుతున్నవారికి  అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌వో అనుమతించలేదు. గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పు మేరకు 2014 సెప్టెంబర్‌ 1 ముందు వాస్తవ జీతంపై డిడెక్షన్‌ జరుగుతున్నవారికి , అటు తర్వాత సర్వీసు కొనసాగుతున్నవారికి అధిక పెన్షన్‌ ఎంచుకునే అవకాశం కల్పించారు. వీరికి కేటగిరి 1, కేటగిరి 2గా పిలుస్తున్నారు. 

అధిక పెన్షన్‌ను ఎంచుకోని క్యాటగిరి 2 ఉద్యోగులకు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇప్పుడు ఎంచుకునే అవకాశం లభించింది. 2014 సెప్టెంబర్‌ 1 నాటికి, అటుపైనా సర్వీసులో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఎటువంటి ఆప్షన్‌నూ ఎంచుకోకుండా 2014 సెప్టెంబర్‌ 1కి ముందే పదవీ విరమణ చేసిన వారికి సుప్రీం తీర్పు వర్తించదు. క్యాటగిరి 1 ఉద్యోగులు అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే మార్గదర్శకాలను 2022 డిసెంబర్‌లోనే ఈపీఎఫ్‌ఓ జారీచేసింది. క్యాటగిరీ 2 ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ తాజాగా సర్క్యులర్‌ విడుదల చేసింది.

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget