English Vs Hindi : మళ్లీ హిందీ వర్సెస్ ప్రాంతీయ భాషలు ! అమిత్ షా చేసిన ఆ కామెంట్లే కారణం
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్నట్లుగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రాంతీయ భాషలపై కుట్ర చేస్తున్నారని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయం హిందీ భాష అని ప్రజలందరూ హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన ప్రకటన మరోసారి రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ సమావేశంలో అమిత్ షా హిందీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం.. ఒకే భాష అన్న పద్దతిలో అమిత్ షా వ్యాఖ్యలు ఉండటంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఓ రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే అది ఇంగ్లిష్ కాదని.. హిందీ అయి ఉండాలన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలు అలజడి రేపాయి. దక్షిణాదిలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగాయి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అలాగే తాజా అమిత్ షా ప్రకటనపై దక్షిణాది రాష్ట్రాలే కాదు.. ఇతర రాష్ట్రాలు కూడా ఖండించాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా భారత ప్రజలు ఏం తినాలి.. ఎ భాష మట్లాడాలి అనేది వారికే వదిలేయాలని సూచించారు.
Unity in diversity is our strength dear @AmitShah Ji. India is a union of states & a true ‘Vasudhaika Kutumbam’
— KTR (@KTRTRS) April 9, 2022
Why don’t we let people of our great nation decide what to eat, what to wear, who to pray to and what language to speak!
Language chauvinism/hegemony will boomerang pic.twitter.com/AwMae3Clra
అమిత్ షా వ్యాఖ్యలు అలజడి రేపాయి. దక్షిణాదిలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగాయి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అలాగే తాజా అమిత్ షా ప్రకటనపై దక్షిణాది రాష్ట్రాలే కాదు.. ఇతర రాష్ట్రాలు కూడా ఖండించాయి. కాంగ్రెస్ సహా శివసేన, డీఎంకే, తృణమూల్ తీవ్రంగా స్పందించాయి. హిందీ మా జాతీయ భాష కానే కాదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.
Hindi is neither a national language nor a link language. In federal system, one can't impose any language forcefully.We don't have any problem learning other languages: Former Karnataka CM&LoP Siddaramaiah on Union HM's remark 'Hindi should be accepted as alternative to English' pic.twitter.com/kOGwukNQ0h
— ANI (@ANI) April 8, 2022
దేశ భాషగా హిందీని గౌరవిస్తాం కానీ.. బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేశారు. హిందీని జాతీయ భాషగా రుద్దే బదులు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తృణమూల్ సలహా ఇచ్చారు. ప్రాంతీయ భాషలు, పార్టీల విలువను తగ్గించే అజెండా ఉన్నట్లు అమిత్ షా మాటలు ఉన్నాయని శివసేన ఆరోపిస్తోంది. అమిత్‌షా ప్రకటన దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటిదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమైక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో హిందీ కంటే తమిళమే ప్రాచీనమైందని, సంస్కృతం, ఉర్దూ, ఇతర భాషల మిశ్రమం హిందీ అని దానిని ప్రత్నామ్నయంగా అంగీకరించేది లేదన్నారు.
Hon'ble Chief Minister of Tamil Nadu Thiru M.K.Stalin's post in Social Media on Hindi Imposition#CMMKSTALIN | #TNDIPR |@CMOTamilnadu @mkstalin@mp_saminathan pic.twitter.com/nD9KXbEnMX
— TN DIPR (@TNDIPRNEWS) April 9, 2022
అమిత్ షా వ్యాఖ్యలు మరోసారి భాషా చర్చకు దారి తీస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో అత్యధిక మంది హిందీ మాట్లాడతారు. కానీ ప్రతి రాష్ట్రానికి ఓ భాష ఉంది. ఈ క్రమంలో హిందీని ఒకే భాషగా.. జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రానికి ఎప్పుడూ వ్యతిరేకత వస్తునే ఉంది.