News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Amar Jawan Jyoti: 'ఆ త్యాగాలు మీకు అర్థం కావు.. మీరు ఆర్పేయండి.. మేం వెలిగిస్తాం'

ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా నిర్విరామంగా వెెలుగుతోన్న అమర జవాను జ్యోతిని నేడు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నారు.

FOLLOW US: 
Share:

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు గుర్తుగా దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు. 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతోన్న ఈ జ్యోతి నేడు ఆరోపోనుంది. దీన్ని జాతీయ యుద్ధ సార్మకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నారు. అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశభక్తిని, త్యాగాన్ని కొంతమంది అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.

అయితే విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. జ్యోతిని ఆర్పేయడం లేదని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నామని తెలిపాయి.

ఎందుకు?

ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో ఈరోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో కలపనున్నారు. నిర్వహణ కష్టతరం కావడం వల్ల రెండింటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

రాహుల్ విమర్శలు..

ఈ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

" కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు ఆరోపోవడం విచారకరం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమర జవాను జ్యోతిని మళ్లీ వెలిగిస్తాం.                                                  "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Also Read: Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Jan 2022 02:28 PM (IST) Tags: Indian Army India Gate Amar Jawan Jyoti National War Memorial national Martyrs

ఇవి కూడా చూడండి

RRC SER: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

RRC SER: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రాతపరీక్ష ఫైనల్ 'కీ' విడుదల

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రాతపరీక్ష ఫైనల్ 'కీ' విడుదల

Food Poison in Train: ట్రైన్‌లో ఫుడ్ పాయిజన్, 90 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత

Food Poison in Train: ట్రైన్‌లో ఫుడ్ పాయిజన్, 90 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత

గుళ్లో గంట కొడితే అది ధ్వని కాలుష్యం కాదా? అజాన్‌ని బ్యాన్ చేయాలన్న పిటిషన్‌పై కోర్టు అసహనం

గుళ్లో గంట కొడితే అది ధ్వని కాలుష్యం కాదా? అజాన్‌ని బ్యాన్ చేయాలన్న పిటిషన్‌పై కోర్టు అసహనం

టాప్ స్టోరీస్

Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !

Lets Vote :  ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు  బాధ్యత కూడా !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం