Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు
కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే 55 పాసింజర్ రైళ్లను రద్దు చేసింది.,
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి24 వరకు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా @SCRailwayIndia ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. pic.twitter.com/Y5IF8kNGsD
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 21, 2022
ఒమిక్రాన్ కేసులు పెరగడం, కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడంతో ఈ నాలుగు రోజులపాటు మొత్తం 55 ప్యాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదే కారణం..
దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
రద్దయిన రైళ్ల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి.
మేడ్చల్-సికింద్రాబాద్, తిరుపతి-కాట్పాడి, డోన్-గుత్తి, డోన్-కర్నూల్ సిటీ, రేపల్లె-తెనాలి, సికింద్రాబాద్-ఉందానగర్ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆలోచన చేస్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు నిబంధనలను పాటించాలని రైల్వేశాఖ సూచిస్తోంది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరింది.
Also Read: Tips to Stay Calm: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు తొమ్మిది చిట్కాలు...
Also Read: Plane Crash: ‘యూట్యూబ్’ వ్యూస్ కోసం విమానం కూల్చేశాడు.. ఇలా అడ్డంగా దొరికిపోయాడు!