అన్వేషించండి

AIR India Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్

Emergency Landing: గాల్లో ఉండగానే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయంలో తీవ్ర ఉత్కంఠ నడుమ విమానం సేఫ్‌గా ల్యాండ్ చేశారు.

AIR India Flight Emergency Landing In Trichy Airport: ఎయిరిండియా (Air India) విమానం గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిలైనట్లు గుర్తించిన పైలెట్లు.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) ప్రకటించారు. దీంతో తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో (Trichy Airport) అత్యవసర ల్యాండింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. తమిళనాడులోని తిరుచ్చి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. పైలెట్లు వెంటనే తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ అధికారులను అప్రమత్తం చేయగా.. వారు ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులతో పాటు అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ జరిగింది

ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమాన చక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలెట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయగా అప్రమత్తమైన అధికారులు తిరుచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో విమానం సేఫ్‌గా ల్యాండ్ కావాలంటే అందులోని ఇంధనం నిర్దేశిత స్థాయి వరకూ తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది.

ఈ క్రమంలో సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన పైలెట్లు.. దాదాపు 2 గంటల పాటు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇదే టైంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ముందస్తు ఏర్పాట్లు సైతం చేశారు. తిరుచ్చి ఎయిర్ పోర్టులో దాదాపు 20 అంబులెన్సులు, 20 అగ్నిమాపక యంత్రాలతో పారా మెడికల్ సిబ్బందిని సైతం సిద్ధంగా ఉంచారు. అయితే, విమానం ఎట్టకేలకు పైలెట్లు సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Ratan Tata: హలో నేను రతన్ టాటాను మాట్లాడుతున్నా - ఆయన ఫోన్ చేస్తే ఖాళీ లేదు తర్వాత రమ్మన్నాం, ఆ కథేంటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Embed widget