అన్వేషించండి

Air Hostess Murder: ఎయిర్ హోస్టెస్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసు కస్టడీలోని నిందితుడు మృతి

Air Hostess Murder: ఎయిర్ హోస్టెస్ హత్య కేసులో అరెస్టైన నిందితుడు పోలీసు కస్టడీలో విగత జీవిగా కనిపించాడు.

Air Hostess Murder: ముంబయిలో ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే హత్య కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రూపాల్ ఓగ్రేను హత్య చేసిన నిందితుడు విక్రమ్ అత్వాల్.. అంధేరీ పోలీసు స్టేషన్ లో మృతి చెంది కనిపించాడు. లాకప్ లో ప్యాంటుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం అంధేరి పోలీస్ స్టేషన్ లాకప్ లోని టాయిలెట్‌లోకి ప్రవేశించిన నిందితుడు విక్రమ్ అత్వాల్.. ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే టాయిలెట్ తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు.

ముంబయిలోని మరోల్ ఏరియాలో నివాసం ఉంటున్న ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే మూడ్రోజుల క్రితం తన నివాసంలో విగత జీవిగా కనిపించింది. ఎయిర్ హోస్టెస్ మృతి చెందిన సమయంలో విక్రమ్ అత్వాల్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ముఖం, చేతులపై గాయాలు కూడా కనిపించాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అతడే నిందితుడని తేలింది. దాంతో విక్రమ్ అత్వాల్ ను అరెస్టు చేసి మంగళవారం అంధేరీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విక్రమ్ కు ఈ రోజు వరకు పోలీసు కస్టడీ విధించింది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో అతడిని కోర్టు ముందు హాజరు పర్చాల్సి ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. విక్రమ్ అత్వాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య కూడా అదే అపార్ట్‌మెంట్ లో పని చేస్తోంది. 

మృతురాలు రూపాల్ ఓగ్రే ఛత్తీస్ గఢ్‌ కు చెందినవారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆమె ఎయిరిండియాకు ఎంపిక అయ్యారు. ఎయిరిండియాలో శిక్షణ కోసం ముంబయికి వచ్చిన రూపాల్.. అంధేరిలోని ఒక హౌజింగ్ సొసైటీలో తన సోదరి, మరో ఫ్రెండ్ తో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే వారం రోజుల క్రితం తన సోదరి, మరో ఫ్రెండ్ ఇద్దరూ వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో ఫ్లాట్ లో రూపాల్ ఓగ్రే ఒంటరిగా ఉంటున్నారు. రూపాల్ ఓగ్రే ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. అదే ఆఖరి సారి ఆ తర్వాత రూపాల్ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.

దీంతో వారు కంగారు పడుతూ ముంబయిలోని ఆమె స్నేహితులను సంప్రదించారు. దీంతో వారు రూపాల్ ఓగ్రే నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. ఫ్లాట్ లాక్ వేసి కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అలా అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాల్ ఓగ్రే మృతదేహం కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ రూపాల్ ఆపాటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అదే హౌజింగ్ సొసైటీలో స్వీపర్ గా పని చేస్తన్న 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్ ను అరెస్టు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget