అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి, పోలీసులకు ఫిర్యాదు
పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
![Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి, పోలీసులకు ఫిర్యాదు AIMIM Chief Asaduddin Owaisi house attacked by mob in Delhi Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి, పోలీసులకు ఫిర్యాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/20/55f05a0300b8dc86972aa107c78b1cac1676862315179234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒవైసీ (ఫైల్ ఫోటో)
ఆల్ ఇండియా మజ్లిస్ - ఎ - ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై కొంత మంది దాడి చేశారు. ఢిల్లీలోని ఇంటిపై దుండగులు రాళ్లు విసిరి దాడి చేయగా, ఆ సమయంలో ఆయన రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడ్డారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది.
రాజస్థాన్‌లో ఈ ఏడాది చివరల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకని అసదుద్దీన్ ఒవైసీ రాజస్థాన్‌లో పర్యటిస్తు్న్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion