Aditya-L1: ఆదిత్య-ఎల్1, విజయవంతమైన తొలి భూకక్ష్య పెంపు విన్యాసం
Aditya-L1: ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
Aditya-L1: భారత్ ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 మిషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఆదిత్య-ఎల్1 ను ఇస్రో విజయవంతంగా నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగా.. తాజాగా ఆదివారం తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 245 x 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. ఆదిత్య-ఎల్1 మిషన్ అంతా సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటించింది. రెండో భూకక్ష్య పెంపును సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిత్య L1 మిషన్‌ని ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీన లాంఛ్ చేసింది ఇస్రో. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. సరిగ్గా 11.50 నిముషాలకు రాకెట్ లాంఛ్ అయింది. రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరవాత అన్ని దశలూ దాటుకుని వెళ్లింది ఆదిత్య L1. చివరకు స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు వెల్లడించింది. ఆదిత్య L1 తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపింది.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 3, 2023
The satellite is healthy and operating nominally.
The first Earth-bound maneuvre (EBN#1) is performed successfully from ISTRAC, Bengaluru. The new orbit attained is 245km x 22459 km.
The next maneuvre (EBN#2) is scheduled for September 5, 2023, around 03:00… pic.twitter.com/sYxFzJF5Oq
ఆదిత్య L1ని క్రమంగా లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది.
L1 కి చేరుకున్నాక..?
ఒక్కసారి L1 ఫేజ్‌కి చేరుకున్న తరవాత ఆదిత్య L1 ఇంజిన్‌ల సాయంతో పాథ్ మార్చుతారు. అక్కడి నుంచి క్రమంగా L1 Halo Orbitలోకి ప్రవేశిస్తుంది. ఆ పాయింట్ వద్దే ఇది స్టేబుల్‌గా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ వద్ద భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవడం వల్ల ఆదిత్య L1 అక్కడే స్థిరంగా ఉంటుంది. అయితే...సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...అది అక్కడ స్టేబుల్‌గా ఉండకుండా చాలా నెమ్మదిగా కదులుతుంది. అక్కడి నుంచే సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలు సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా ఫొటోలు తీసి పంపుతుంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 3 సక్సెస్‌తో జోష్ మీదున్న ఇస్రో...ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందన్న ధీమాతో ఉంది.