ABP C Voter Opinion Poll: రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ వెనుకంజ! ABP సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో బీజేపీదే హవా
ABP C Voter Opinion Poll: రాజస్థాన్‌లో ఎన్నికల ట్రెండ్‌పై ఏబీపీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ABP C Voter Opinion Poll:
రాజస్థాన్ ఎన్నికల్లో ఎవరి వైపు ఓటర్లు మొగ్గుతున్నారో చెప్పింది ABP CVoter Opinion Poll. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అశోక్ గహ్లోట్ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది ఒపీనియన్ పోల్. కాంగ్రెస్‌కి 64 సీట్లు, బీజేపీకి 132 స్థానాలు దక్కుతాయని తెలిపింది. నాలుగు స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశముంది. మొత్తంగా చూస్తే..కాంగ్రెస్‌కి 59-69,బీజేపీకి 127-137 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇతరులు 2-6 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్టు అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలున్నాయి. ఇతరులు 2-6 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్టు అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే...గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 39.3% ఓట్లు వచ్చాయి. ఈ సారి 42% వరకూ పెరిగే అవకాశముంది. ఇక బీజేపీ విషయానికొస్తే..గత ఎన్నికల్లో 38.8% ఓట్లు దక్కించుకుంది. ఈ సారి ఏకంగా 46.7% మేర ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్. బీఎస్‌పీకి గత ఎన్నికల్లో 4% ఓట్లు రాగా..ఈసారి అది 1%కి పడిపోనుంది. ఇక ఇతరులకు ఈ సారి 10.3% మేర ఓట్లు దక్కే అవకాశాలున్నాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 100 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి 64 సీట్లకే పరిమితం కానుంది. అప్పుడు బీజేపీకి 73 సీట్లు వచ్చాయి. కానీ ఈ సారి సీట్ల సంఖ్య భారీగా పెరగనుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. బీజేపీకి 132 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గత ఎన్నికల్లో బీఎస్‌పీకి 6, ఇతరులకు 21 స్థానాలు దక్కాయి. ఈ సారి బీఎస్‌పీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. ఇక ఇతరులు 4 స్థానాలకే పరిమితమవనున్నారు.కీలకమైన ధూందర్ నియోజకవర్గంలో మొత్తం 58 సీట్లున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కి 27 సీట్లు, బీజేపీకి 31 దక్కనున్నాయి. హదౌటిలో కాంగ్రెస్‌కి 3,బీజేపీ 14 స్థానాల్లో విజయం సాధించనుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll personal interviews (Face to Face) conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 11,928). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval. ]