అన్వేషించండి

Blue Moon: ఆకాశంలో అరుదైన ఘటన, సూపర్ బ్లూ మూన్‌గా చందమామ

Blue Moon: ఆకాశంలో బుుధవారం రాత్రి అరుదైన ఘటన జరిగింది. ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది.

Blue Moon: బుుధవారం రాత్రి ఆకాశంలో అరుదైన ఘటన జరిగింది. ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్‌ మూన్‌ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని పెరీజియన్‌ పౌర్ణమిగా పిలుస్తారు. ఇలా ఒకే నెలలో రెండుసార్లు నిండు పౌర్ణమి ఏర్పడటాన్ని సూపర్‌ బ్లూ మూన్‌ లేదా బ్లూ మూన్‌ పేర్కొంటారు. 

ఆగస్టు నెలలో ఇలా రెండోసారి కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సమయాలకు అనుగుణంగా ఆగస్టు 30 లేదా 31 తేదీల్లో చందమామ సూపర్ బ్లూ మూన్ గా కనువిందు చేయనుంది. అయితే పేరులో బ్లూ ఉందని చంద్రుడు నీలం రంగులో కనిపించడు. ఈసారి చంద్రుడికి తోడుగా శనిగ్రహం కూడా తోడు అయ్యింది. జాబిల్లికి ఐదు డిగ్రీల ఎత్తులో ఓ ప్రకాశవంతమైన బిందువుగా శనిగ్రహం కనిపించనుంది. 

నాసా ప్రకారం భారత్‌లో ఈ బ్లూమూన్‌ 30 తేదీ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రకాశవంతంగా కనిపించనుంది. సూపర్‌ బ్లూ మూన్‌ మాత్రం గురువారం (ఆగస్టు 31) ఉదయం 7గంటల ప్రాంతంలో గరిష్ఠ స్థాయికి చేరుకుని కనువిందు చేయనుంది. 2018లో ఇలా ఒకేనెలలో రెండుసార్లు కనిపించగా.. తిరిగి 2037లో ఇలా జరగనుంది. 

ఒకే నెలలో రెండోసారి ఫుల్‌ మూన్‌ కనిపిస్తే ఇలా బ్లూ మూన్‌ అంటారు. ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్‌ మూన్‌. ఎందుకంటే ఆగస్టు 1 వ తేదీన పౌర్ణమి రోజున పూర్తి చంద్రుడిని చూశాం. ఈ విధంగా పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. రెండు పౌర్ణమిలు ఒకే నెలలో రావు. అలాగే నాసా చెప్పేదాని ప్రకారం.. సీజన్‌లోని మూడో ఫుల్‌ మూన్‌ కూడా బ్లూ మూన్‌ అంటారు. 

ఈ రోజు వచ్చిన నిండు చంద్రుడు సూపర్‌ మూన్‌ , బ్లూ మూన్‌ కూడా సూపర్‌ మూన్‌. సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతి వంతంగా, సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. చంద్రుడు పరిభ్రమించ కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అదే సమయంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఇలా సూపర్‌ మూన్‌ కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే సూపర్‌ మూన్‌ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్‌ మూన్‌. బుధవారం కనిపించే చందమామ చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా, నారింజ రంగులో కనిపించబోతోంది. 

సూపర్‌ మూన్‌ చూడడానికి మంచి సమయం ఏదంటే.. సూర్యాస్తమయం తర్వాత కొన్ని గంటల అనంతరం చంద్రుడు వచ్చినప్పుడు చూస్తే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఆగస్టు ౩౦వ తేదీ రాత్రి 8.30 తర్వాత ఆకాశంలోకి చూస్తూ సూపర్‌ బ్లూ మూన్‌ అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడు పూర్తి ప్రకాశవంతంగా మారి అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్ర వేళ చంద్రోదయం సమయంలో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశంలో అద్భుతాలు చూడడంపై ఆసక్తి ఉన్న వారు ఇలాంటి వాటిని చాలా ఆసక్తితో చూస్తుంటారు. యూరప్‌ నుంచి చూసే వారికి ఇది ఇంకా మంచిగా కనిపించనుంది.

నాసా వివరాల ప్రకారం.. బ్లూ సూపర్‌ మూన్‌ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలిపింది. ఒక్కోసారి బ్లూ సూపర్‌ మూన్‌ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. ఫుల్‌ మూన్‌ రోజు బ్లూ సపర్‌ మూన్‌ రావడానికి 3 శాతం అవకాశం ఉంటే, పౌర్ణమి రోజులో సూపర్‌ మూన్‌ రావడానికి 25శాతం అవకాశం ఉంటుందని తెలిపింది.

అంతేకాకుండా ఈ బుధవారం చంద్రుడిని చూసే సమయంలో శనిగ్రహం కూడా కనిపించే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ సమయంలో ఇది చంద్రుడికి దగ్గరగా వస్తుందని తెలిపారు. బైనాక్యులర్‌ లేదా టెలిస్కోప్‌తో చూస్తే వీక్షకులకు గ్రహం ఆనవాళ్లు కాస్త మంచిగా కనిపించే అవకాశం ఉందని తెలిపారు. శనివారం రోజు శని గ్రహం నేరుగా సూర్యుడికి ఎదురుగా వస్తుందని, ఆదివారం రాత్రి వరకు అలా సూర్యుడికి ఎదురుగా శనిగ్రహం ఉంటుందని, సూర్యకాంతి గ్రహంపై పడినప్పుడు కాస్త ప్రకాశవంతంగా, పెద్దగా కనిపించే అవకాశం ఉందని కూడా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇది కనిపిస్తుందని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget