News
News
X

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

లైఫ్ పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ లింక్ ను క్లిక్ చేయండి. అందమైన అమ్మాయిలు క్షణాల్లో వచ్చి మీ ఒళ్లో వాలతారు.! అంటూ  ఫేక్ ప్రకటనలు చేసి, మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.

FOLLOW US: 
Share:

రొటీన్ లైఫ్ బోర్ కొడుతోందా ! లైఫ్ పార్ట్‌నర్ కోసం వెతకడం వెతుకుతున్నారా అయితే ఈ లింక్ ను క్లిక్ చేయండి. అందమైన అమ్మాయిలు క్షణాల్లో మీకు అందుబాటులోకి వస్తారు అంటూ  ప్రకటనలు గుప్పిస్తారు. ఒక్క సారి క్లిక్‌ చేశారా.? ఇక మీ సంగతి అంతే. దెబ్బకు మీ జేబులు ఖాళీ అయిపోతాయి. ఇలాంటి గ్యాంగ్‌లు చాలా  ఉన్నాయి. ముఖ్యంగా యువకులను, జాబ్ చేస్తున్న మగవారిని టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో నిలువునా దోచేస్తారు. అమ్మాయిల ఫోటోలు పెట్టి, రూ. 2000 చెల్లిస్తే చాలు అమ్మాయి మీ ఇంటికి  వస్తుందంటూ ప్రచారం చేస్తారు.  విషయం తెలియని చాలా మంది కుర్రాళ్లు  ఇలాంటి ప్రటనలను నమ్మి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ జమానాలో ఇస్మార్ట్‌ కేటుగాళ్ల  ఆగడాల మరింత ఎక్కువ అయ్యాయనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. టిండర్‌ అనే డేటింగ్‌ యాప్‌ ద్వారా కిడ్నాప్‌లకు గురి అవుతున్నారని వీరిలో ముఖ్యంగా బాధితులుగా పురుషులే ఉన్నట్లు తెలుస్తోంది. 

టిండర్‌లో మోసపోయేది వీళ్లే:
అయితే కేవలం ఒంటరిగా ఉండే అంకుల్స్‌ ను, యువకులను మాత్రమే టార్గెట్‌ చేస్తారంటా సైబర్‌ కేటుగాళ్లు. 40 ఏళ్లు పైబడి, కాస్త ఆస్తిపాస్తులు ఉన్న ఒంటరి పురుషులు బాధితులు అవుతున్నారు. చాలామంది నేరగాళ్లు, టిండర్ యాప్‌లో ప్రలోభపెట్టే మెసేజ్‌లు చేయడం ద్వారా, వీలైనంత త్వరగా కలవాలని ఆశ పుట్టించేలా మాట్లాడటం ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. అందమైన అమ్మాయిల ఫోటోలు ఉంచి, ముందుగానే టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న వ్యక్తికి ఫేక్‌ అమ్మాయి ఐడీతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతారు నేరగాళ్లు. ఆ తర్వాతి లేదా రెండు మూడు రోజుల తర్వాత బాధితులను సాయంత్రం సమయంలో, ఓ మారుమూల ప్రాంతాల్లో పర్సనల్‌గా కలుద్దామంటూ కేటుగాళ్లు కోరుతారు. ఈ విషయాలన్నింటిని చాటింగ్‌ రూపంలో లేదా వాయిస్‌ చేంజర్‌ యాప్‌తో అబ్బాయి వాయిస్‌ను అమ్మాయి వాయిస్‌గా మార్చి బాధితుడికి కాల్స్‌ చేస్తారు. యాప్‌లో పరిచయమైన రెండు, మూడు రోజుల తర్వాత ఇలాంటి సమావేశాలు జరుగుతాయని కొంత మంది బాధితులు తెలిపారు. ఇలా చెప్పిన ప్రాంతానికి బాధితుడు లేదా బాధితురాలు వచ్చిన వెంబడే కిడ్నాప్‌లు చేసి మరీ డబ్బులు తీసుకుని జంప్‌ అవుతారు. ఇక మరోరకంగా కూడా దోపిడికి పాల్పడే అవకాశం ఉంది. మరో కొద్ది గంటల్లో కలుస్తామన్న సమయంలో ఏదైన అర్జెంట్‌ వర్క్‌ ఉందని లేదా ఇంట్లో ప్రాబ్లమ్‌ ఉందన్న కారణంతో బాధితుడి నుంచి డబ్బులు లాగుతారు. అలా కొంచెం కొంచెంగా మొదలై.. ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని, ఆ తర్వాత సిమ్‌ కార్డ్‌ను మార్చేస్తారు. అయితే భారత్‌ ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో డేటింగ్‌ యాప్స్‌ ద్వారా మోసపోయి, కిడ్నాప్‌ అయి వాళ్ల సంఖ్యే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మోసాలు ప్రధానంగా ముంబై, ఢిల్లీ, రాయ్‌పూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లోనే జరుగుతున్నాయని అధికారులు చెబుతుంటారు.  

డేటింగ్ యాప్స్ లో జరిగే మోసాలు:
కొంతమంది కిలాడీ లేడీలు ఫేక్‌ వివరాలతో టిండర్‌ వంటి డేటింగ్‌ యాప్స్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంటారు. ఆ తర్వాత యాప్‌లో ఉన్న రిచ్‌ పర్సన్‌ను టార్గెట్‌ చేసి, అతడికి రిక్వెస్ట్‌లు పెట్టి ఆపై వీళ్లే బాధితుడికి ఫోన్‌ నెంబర్‌ ఇస్తారు. ఆ తర్వాత ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూనే.. రొమాటింక్‌ మూడ్‌లోకి బాధితుడిని తీసుకువచ్చి న్యూడ్స్‌ కాల్స్‌ మాట్లాడేలా ప్లాన్‌ చేస్తారు కిలాడీ లేడీలు. ఆ తర్వాత న్యూడ్‌ కాల్స్‌కు సంబంధించిన వీడియోను అడ్డు పెట్టుకుని, బాధితుడిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే.. నీ న్యూడ్‌ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరిపంపులకు దిగుతారు. ఇక చేసేది ఏమి లేక ఆ బాధితుడు డబ్బులు ఇచ్చేస్తాడు. అయితే ఇలాంటి కేసులు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే.. కేసు ఎంక్వైరీ పేరుతో ఎక్కడ తన విషయం మీడియాకు తెలుస్తుందోనని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందోనన్న భయంతో ఆగిపోతుంటారు. 

Published at : 05 Dec 2022 07:32 PM (IST) Tags: Dating App dating app fraud nude video blackmail cheating women

సంబంధిత కథనాలు

MAT 2023 Notification: మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!

MAT 2023 Notification: మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!

KVS Recruitment Exams: రేపటి నుంచి కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

KVS Recruitment Exams: రేపటి నుంచి కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

SSC Exams: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!

SSC Exams: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!

Rat Steals Necklace : డైమండ్ నెక్లెస్ చోరీచేసిన ఎలుక, ప్రియురాలికి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్

Rat Steals Necklace : డైమండ్  నెక్లెస్ చోరీచేసిన ఎలుక, ప్రియురాలికి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!