News
News
X

Zika virus: ఏడేళ్ల బాలికకు పాజిటివ్- దేశంలో మరోసారి జికా వైరస్ టెన్షన్!

ఓ వైపు కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే, మరోవైపు కొత్తగా జికా వైరస్ కేసు వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఏడేళ్ల బాలికకు పాజిటివ్ గా తేలింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

FOLLOW US: 

అసలే విపరీతమైన వర్షాలు.. వాతావరణ మార్పుల కారణంగా అనేక అనారోగ్యాల సమస్యల బారిన పడుతూ ప్రజలు ఆగమైపోతున్నారు. ఇది చాలదన్నట్లు కరోనా. దేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన ఓ వైపు ఉండగానే మరో భయం దేశ ప్రజలను వెంటాడుతోంది. కొత్తగా జికా వైరస్ కేసు వెలుగు చూసింది. ఈ వార్త విన్న ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్ గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తలసరి గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని తెలిపారు.

రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా జికా వైరస్ కేసు గతేడాది పుణెలో నమోదైందని.. రెండో కేస్‌ ఇదేనని వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున.. ఆ తర్వాత దోమలు, ఫంగస్ వంటిసి పెరిగి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వీటన్నిటిని తప్పించుకోవాలంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

జికా వైరస్ అంటే ఏంటి?

జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ... ఇప్పటి వరకు దీనకి మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్ సోకడం వల్ల కొందరిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు ఈ జికా వైరస్ సోకినట్లు అయితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టబోయే శిశువు మెదడు సరిగా అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. 1947 ప్రాంతంలో ఈ వైరస్ అడువల్లో ఉండే కోతుల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో తమిళనాడు, అహ్మదబాద్ లలో ఈ కేసులు నమోదైనట్లు తేలింది.

ఈ వైరస్ అంత ప్రమాదకరమా..?

గత మూడేళ్లుగా కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రత తగ్గిందని సంబుర పడుతున్నారు. ఈ క్రమంలోనే పాఠషాలలు, కళాశాలల తెరిచి.. అన్ని కార్యకలాపాలను సాగిస్తున్నారు. కానీ కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇది చాలదన్నట్లు తాజాగా మహారాష్ట్రలో జికి వైరస్ కేసు వెలుగు చూడడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

అయితే దోమ వల్ల జికా వైరస్ సోకుతున్నందును.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో, ఇంటి బయట దోమలు నిల్వకుండా తరచుగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని వివరిస్తున్నారు. ఏదైనా జ్వరం, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏం కాదులే అని ఇంట్లోనే ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దోమలను దరి చేరనీయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు జికా వైరస్ సోకకుండా చేస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అసలే వర్షాకాలం ఆపై వ్యాధులు, కొత్త కొత్త వైరస్ లు.. జాగ్రత్త సుమీ!

Published at : 14 Jul 2022 07:59 AM (IST) Tags: Zika Virus student infected with zika virus zika virus problems zika virus precautions zika virus features

సంబంధిత కథనాలు

Delhi liquor Scam  : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!