అన్వేషించండి

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు, అమరులైన నలుగురు భద్రతా సిబ్బంది

Doda: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ ఎదురు కాల్పుల్లో  ఆర్మీ అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 

రాత్రి 8.45 గంటల సమయంలో ధారి గోటే ఉర్బాగీ వద్ద రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతంలోనే నక్కి ఉన్న ఉగ్రవాదలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ కూడా ప్రతిగా కాల్పులు జరిపింది. 

20 నిమిషాలకుపైగా సాగిన ఈ కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు, ఒక పోలీసు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో నలుగురు అమరులైనట్టు అధికారులు తెలిపారు.

భారత సైన్యం ఏం చెప్పిందంటే.
ఈ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని, ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

"ఈ ప్రాంతానికి అదనపు దళాలను పంపారు, ఆపరేషన్ కొనసాగుతోంది" అని వైట్ నైట్ కార్ప్స్ అని కూడా పిలువబడే ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపింది.

ఈ దాడికి ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్  బాధ్యత తీసుకుంది. దోడాలో భద్రతా దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Embed widget