అన్వేషించండి

Viral News: 'విపత్తు వేళ మీ సేవలకు సెల్యూట్' - ఇండియన్ ఆర్మీకి ఓ బాలుడి లేఖ, స్పందించిన ఆర్మీ అధికారులు

Kerala Landslide: కేరళలోని వయనాడ్ విధ్వంసం వేళ సహాయం అందిస్తోన్న భారత ఆర్మీని ప్రశంసిస్తూ ఓ బాలుడు లేఖ రాశాడు. ఈ లేఖకు స్పందించిన ఆర్మీ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Boy Letter To Indian Army: కేరళలోని వయనాడ్ (Vayanad) జిల్లాలో ఘోర విపత్తు వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి విధ్వంసం ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు కొండ చరియలు (Landslide) విరిగిపడి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అందాలకు నెలవుగా.. ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా ఉన్న కేరళలోని (Kerala) కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. పెను విపత్తు సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన భారత ఆర్మీ (Indian Army) 5 రోజులుగా సహాయక చర్యలు చేపడుతూ బాధితులకు అండగా నిలుస్తోంది. సాంకేతిక సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు వందల మృతదేహాలను వెలికితీసింది. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కొండ చరియలు, మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిని తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతున్నారు. సహాయక చర్యలు వేగవంతం కావడం కోసం 24 గంటల్లోనే ఆర్మీ ఓ వంతెనను నిర్మించింది. రాత్రీ పగలూ తేడా లేకుండా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు ఆర్మీ అధికారులు, సిబ్బంది శ్రమిస్తోన్న తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత ఆర్మీకి ఓ విద్యార్థి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖకు ఇండియన్ ఆర్మీ సైతం స్పందించింది.

'మీ సేవలకు సెల్యూట్'

బాధితులను రక్షించేందుకు ఆర్మీ శ్రమిస్తోన్న తీరును చూసిన వయనాడ్‌కు చెందిన మూడో తరగతి విద్యార్థి రాయన్ భారత ఆర్మీకి లేఖ రాశాడు. 'ప్రియమైన ఇండియన్ ఆర్మీ.. నా జన్మస్థలం వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. కొండ చరియలు విరిగిపడి ఎందరో విగతజీవులుగా మారారు. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమంది ప్రజలను మీరు మీ ప్రాణాలకు తెగించి కాపాడడం చూశాను. ఆహారం అందుబాటులో లేకపోయినా కేవలం బిస్కెట్లు తింటూనే సరిపెట్టుకుంటున్నారు. బాధితులకు త్వరగా సహాయం అందేలా చర్యలు చేపడుతున్నారు. బాధితులను కాపాడేందుకు వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీరు శ్రమిస్తోన్న తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీకు సెల్యూట్. నేను కూడా ఏదో ఒక రోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను.' అంటూ లేఖలో పేర్కొన్నాడు.

స్పందించిన ఆర్మీ

బాలుడి లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఇచ్చే ప్రేరణతో తాము దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలుడి లేఖను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ స్పందన తెలియజేశారు. 'డియర్ రాయన్ నువ్వు నీ హృదయపూర్వకంగా లేఖలో రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా వారికి అండగా ఉండాలనేదే మా లక్ష్యం. మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణతో మేము మరింత ఉత్సాహంగా పని చేస్తాం. నువ్వు ఆర్మీ యూనిఫామ్ ధరించి మాతో కలిసి పనే చేసే రోజు కోసం ఎదురుచూస్తుంటాం. నీ ధైర్యానికి, స్ఫూర్తికి ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు. ఈ లేఖ వైరల్ కాగా చిన్నారి ఆలోచనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

మరోవైపు, విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎటు చూసిన బురదమయం కావడంతో సహాయానికి ఇబ్బంది ఏర్పడుతోంది. ఆర్మీ, స్థానిక పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, వైద్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
Nara Lokesh: న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
Nara Lokesh: న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
న్యూయార్క్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్‌- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Lucky Bhaskar Collection Day 2: బాక్సాఫీస్ బరిలో రెండో రోజూ 'లక్కీ భాస్కర్' జోరు... 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
బాక్సాఫీస్ బరిలో రెండో రోజూ 'లక్కీ భాస్కర్' జోరు... 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget