అన్వేషించండి

Wheat Imports: గోధుమల ధరలు తగ్గించేందుకు భారత్ ప్రయత్నాలు, రష్యాతో స్పెషల్ డీల్‌!

Wheat Imports: రష్యా నుంచి తక్కువ ధరకే గోధుమలు దిగుమతి చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

Wheat Imports: 

తక్కువ ధరకే..

రష్యా నుంచి తక్కువ ధరకే గోధుమలు దిగుమతి చేసుకునే పనిలో పడింది భారత్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవాలంటే డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. అందులోనూ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఇలాంటప్పుడే ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది మోదీ సర్కార్. అందులో భాగంగానే రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ ట్రేడ్ ద్వారా అయినా, లేదంటే రెండు ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పందం చేసుకునైనా గోధుమలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్టు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జులై రికార్డు స్థాయి ధర పలికాయి గోధుమలు. గత 15 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. నిజానికి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ దౌత్య చర్చలు జరపలేదు. చివరిసారిగా 2017లో ఆ అవసరం వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార పడుతోంది. 

కొద్ది వారాల్లోనే..

గోధుమల ధరలు తగ్గితే క్రమంగా మిగతావన్నీ అదుపులోకి వస్తాయని భావిస్తోంది. పప్పు ధరలూ తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై అధికారులు స్పందించడం లేదు. మరి కొద్ది వారాల్లోనే ఈ డీల్‌ కుదురుతుందని సమాచారం. అయితే...కొందరు అధికారులు మాత్రం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న కొరతను తీర్చేందుకు 3-4 మిలియన్ల మెట్రిక్ టన్నుల గోధుమలు అవసరం పడతాయి. కానీ భారత్ ఏకంగా 8-9 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల్ని దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరవాత భారత్‌కి భారీ మొత్తంలో గోధుమలు పంపించింది రష్యా. ఆహార అవసరాలు తీర్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. గోధుమలతో పాటు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని కూడా దిగుమతి చేసుకుంటోంది ఇండియా. చెల్లింపులను యూఎస్ డాలర్లలో చేస్తోంది. ఇప్పుడు కూడా అదే తరహాలో పెద్ద మొత్తంలో గోధుమలు దిగుమతి చేసుకునే అవకాశముంది. టన్నుకి 25-40 డాలర్ల చొప్పున రష్యా డిస్కౌంట్ ఇవ్వనుందని తెలుస్తోంది. తద్వారా దేశీయంగా ధరలు తగ్గుతాయి. రెండు నెలల్లోనే గోధుమల ధరలు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి భారత్‌లో  28.3 మిలియన్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. 

ప్రపంచంలో గోధుమలను ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద దేశం భారతదేశం. అయితే, దేశీయ మార్కెట్‌లో గోధుమల అందుబాటులో లేక ధరలు ఒక్కసారిగా పెరగడంతో, గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తూ 2022 మే నెలలో కేంద్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల కారణంగా గోధుమ పంటకు నష్టం వాటిల్లడంతో, గోధుమల సేకరణల్లో నాణ్యత నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, చండీగఢ్ రాష్ట్రాల్లో రైతులకు కోసం నిబంధనల మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: ముస్లింలంతా ఒకప్పుడు హిందువులే, మన మూలాలు హిందూ మతంలోనే - గులాం నబీ ఆజాద్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget