India-Pak tensions: ముస్లిం దేశం నుంచి భారత్ ఎటాక్ - పాకిస్తాన్‌కు అసలు ముప్పు ఇదే !
Tajikistan airbase: తజకిస్తాన్ వైమానిక స్థావరం నుంచి పాక్ పై భారత్ దాడి చేయనుంది. అదే జరిగితే ఇస్లామాబాద్ క్షణాల్లో ధ్వంసం అయిపోతుంది.

India to attack Pakistan from Tajikistan airbase: పాకిస్తాన్ పై భారత్ ఓ ముస్లిం దేశం నుంచి ఎటాక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భారత్ కు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తజకిస్తాన్‌లోని భారత వైమానిక స్థావరం ఉంది. దాని పేరు ఫర్ఖోర్ ఎయిర్‌బేస్ (Farkhor Air Base ) అయినీ ఎయిర్‌బేస్ అని కూడా పిలుస్తారు. ఇది భారత్‌కు మధ్య ఆసియాలో తొలి సైనిక స్థావరం . దక్షిణ ఆసియా వెలుపల ఉన్న అతి ముఖ్యమైన సైనిక సదుపాయాలలో ఒకటి.
ఫర్ఖోర్ ఎయిర్‌బేస్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్, ఐసిస్-ఖొరాసాన్, ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా సాగించడానికి భారత్‌కు కీలకమైన స్థానం. ఈ స్థావరం ఇంటెలిజెన్స్ సేకరణ, డ్రోన్ నిఘా, సర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల, భారత్‌కు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు లేదా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇది పాకిస్తాన్ కు ఆందోళన కలిగిస్తోంది. తూర్పు సరిహద్దులో భారత్, పశ్చిమ సరిహద్దులో తజకిస్తాన్ నుంచి భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ తట్టుకోవడం కష్టం.
భారత్ , తజకిస్తాన్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. తజకిస్తాన్‌కు భారత్ ఆర్థిక సహాయం, వైద్య సదుపాయాలు , సైనిక శిక్షణను అందిస్తుంది. ఈ స్థావరం రెండు దేశాల మధ్య రక్షణ సహకారానికి చిహ్నంగా ఉంది. - ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ క్క రాజకీయ , ఆర్థిక పెట్టుబడులను రక్షించడానికి ఈ స్థావరం కీలకం. ఇప్పుడు పాకిస్తాన్ పై దాడి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
తజకిస్తాన్ నుంచి భారత్ ఒక సర్జికల్ స్ట్రైక్ లేదా డ్రోన్ దాడిని ఎంచుకుంటే, ఇది పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు లేదా మిలిటెంట్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. తజకిస్తాన్ నుంచి జరిగితే పాకిస్తాన్ ఊహించని దిశ నుంచి దాడి జరగడం వల్ల ఆశ్చర్యకరమైన ప్రభావం ఉంటుంది. తజికిస్తాన్‌లో ఉన్న భారతదేశ వైమానిక స్థావరం పాకిస్తాన్ పై దాడి చేయడానికి చాలా కీలకం.
భారతదేశం తజికిస్తాన్‌లో ఉన్న ఈ వైమానిక స్థావరం నుండి దాడి చేస్తే, పాకిస్తాన్ పూర్తిగా నాశనం అవుతుంది. వైమానిక స్థావరం తజికిస్తాన్ రాజధాని దుషాంబే నుండి కేవలం 15 కి.మీ దూరంలో ఉంది. అక్కడ నుండి పెషావర్ దూరం 500 కి.మీ, ఇస్లామాబాద్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పాక్) 600 కి.మీ దూరంలో ఉన్నాయి . అఫ్ఘానిస్తాన్ సరిహద్దు నుండి ఈ నగరం కేవలం 150 కి.మీ దూరంలో ఉంది.
వైమానిక స్థావరం నుండి దాడి చేయడానికి భారతదేశం వద్ద రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అఫ్ఘానిస్తాన్ ద్వారా పాకిస్తాన్‌పై దాడి, రెండవది వఖాన్ కారిడార్, ఇది పాక్ మరియు ఉత్తర తజికిస్తాన్ మధ్య ఉంది. మొదటి మార్గంలో భారతీయ విమానాలు అఫ్ఘానిస్తాన్ ద్వారా వెళ్ళాలి, అక్కడ వైమానిక భద్రత లేకపోవడం వల్ల పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం సులభం. వఖాన్ కారిడార్ మార్గంలో కూడా భద్రత లేదు కాబట్టి ఇది అలాంటి సమయాల్లో ఉపయోగపడుతుంది. కొన్ని నివేదికలు భారతదేశం ఇక్కడ SU-30MKI ఫైటర్ జెట్‌లను మోహరించిందని వెల్లడిస్తున్నాయి.
90వ దశకం నుండి భారతీయ సైన్యం తజికిస్తాన్‌లో ఉంది. అమెరికాలో 9/11 దాడుల తరువాత, భారతీయ అధికారులు అయ్యి వైమానిక స్థావరాన్ని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం , అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారు మరియు భారతదేశం ఇక్కడ 3,200 మీటర్ల పొడవైన రన్‌వేని నిర్మించింది మరియు విమానాలకు అవసరమైన సౌకర్యాలను కూడా మెరుగుపరిచింది.





















