(Source: ECI/ABP News/ABP Majha)
గాజాకి భారత్ భారీ సాయం, స్పెషల్ ఫ్లైట్‌లో టన్నుల కొద్ది మెడిసిన్స్
India Sends Aid: యుద్ధ ప్రభావిత ప్రాంతమైన గాజాకి భారత్ భారీ సాయం అందిస్తోంది.
India Sends Aid to Gaza:
గాజాకి భారత్ సాయం..
యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాకి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. భారీ ఎత్తున వైద్య సాయం అందించింది. అక్కడి ప్రజలకు అవసరమైన వాటిని ప్రత్యేక ఫ్లైట్‌లో పంపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌తో పాటు సర్జికల్ ఐటమ్స్, టెంట్స్ పంపుతోంది. యూపీలోని ఘజియాబాద్‌లో Hindon Air Base నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన C-17 ఫ్లైట్‌లో వీటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 6.5 టన్నుల మెడికల ఎయిడ్, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపింది. ఈజిప్ట్‌లోని El-Arish Airportకి ఈ ఫ్లైట్ చేరుకోనుంది. గాజాకు ఏ సాయం అందాలన్నా అది ఈజిప్ట్ మీదుగా వెళ్లాల్సిందే. అందుకే ఈజిప్ట్‌తో సంప్రదింపులు జరిపింది భారత్. గాజాకు సాయం అందించేందుకు అనుమతినిచ్చింది. అయితే...ఆహారం, నీరు, మెడిసిన్స్‌కి పంపించేందుకు మాత్రమే ఈజిప్ట్ అంగీకరించింది. చమురు మాత్రం పంపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఒక్కసారి ఈ వెహికిల్స్ అన్నీ వెళ్లిపోయాక వెంటనే ఈజిప్ట్ సరిహద్దుల్ని మూసేస్తోంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. గాజా అత్యంత దారుణమైన స్థితిలో ఉందని, ప్రపంచమంతా కలిసి మరింత సాయం అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.
🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸!
— Arindam Bagchi (@MEAIndia) October 22, 2023
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్‌తో ( Mahmoud Abbas) మాట్లాడారు. గాజాలోని హాస్పిటల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో మోదీ సానుభూతి తెలిపారు. ఆ ఘటనలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉన్న దశాబ్దాల వివాదాన్ని అర్థం చేసుకున్నామని, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. పాలస్తీనాకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజులకే భారత్ నుంచి గాజాకు భారీ సాయం అందింది.
#WATCH | Hindon Air Base, Ghaziabad (Uttar Pradesh) | An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
— ANI (@ANI) October 22, 2023
The material includes essential life-saving… pic.twitter.com/HF5WJNAB58
హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజా అతాలకుతలమైంది. హమాస్ చెరలో బందీలు సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మిలిటెంట్ల వద్ద 210 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చని తెలిపింది. కనిపించకుండా పోయిన వారి కోసం ఐడీఎప్ ఆపరేషన్ కొనసాగుతోంది. హమాస్ పై ఆపరేషన్ పూర్తైన తర్వాత పూర్తి సంఖ్య వెల్లడయ్యే అవకాశం ఉందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 210 మందిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు అమెరికన్-ఇజ్రాయెల్ మహిళలను విడుదల చేసింది.
Also Read: డెట్రాయిట్లో యూదు మహిళ దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన దుండగులు