అన్వేషించండి

Germany Remarks: కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ వ్యాఖ్యలు, గట్టిగా బదులిచ్చిన భారత్

India Slams Germany: అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యల్ని భార్య తీవ్రంగా ఖండించింది.

India Protests Germany: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని మందలించింది. ఢిల్లీలోని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పిలిచి నిలదీసింది. భారత న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది. తమది ప్రజాస్వామ్య దేశంలో, చట్ట ప్రకారం ఏం జరుగుతుందో అదే జరుగుతుందని స్పష్టం చేసింది. అనవసరంగా ఏవేవో ఊహించుకుని మాట్లాడడం తగదని హెచ్చరించింది. ఈ మేరకు జర్మనీ తీరుని నిరసిస్తూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

"భారత్‌ ఓ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పటిష్ఠమైన చట్టాలున్నాయి. ఇలాంటి అవినీతి కేసుల్లో చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. భారత్‌లోనే కాదు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా జరిగేది ఇదే. పక్షపాత వ్యాఖ్యలు, అనవసరపు ఊహాగానాలు సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు"

- భారత ప్రభుత్వం

ఏం జరిగింది..?

అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌ని పారదర్శకంగా విచారించాలని, ఆయనకు చట్టపరంగానే ట్రయల్స్ నిర్వహించాలని అని వ్యాఖ్యానించింది జర్మనీ విదేశాంగ శాఖ. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది తప్పకుండా జరగాలని వెల్లడించింది. దీనిపైనే భారత్ మండి పడింది. 

"భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. ఈ కేసులో చట్ట ప్రకారమే విచారణ జరగాలి. మిగతా అందరిలాగే అరవింద్ కేజ్రీవాల్ అందుకు అర్హులు. ఎలాంటి పక్షపాతం, ఆంక్షలు లేకుండా ఆయన అన్ని విధాల చట్టపరమైన మార్గాలను ఆయనకు అందుబాటులో ఉంచాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవకాశమివ్వాలి. ఏ చట్టం లక్ష్యం అయినా ఇదే"

- జర్మనీ విదేశాంగ శాఖ

 

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు రెండు గంటల పాటు విచారించారు. ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి పది రోజుల కస్టడీకి అనుమతి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ కోర్టులో స్పష్టం చేసింది. ఆప్‌, సౌత్‌ గ్రూప్‌కి మధ్య విజయ్ నాయర్‌ వారధిగా పని చేశారని వెల్లడించింది. మొత్తం 5 ప్రధాన అభియోగాలు చేసింది. ఈ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ భాగస్వామ్యం ఉందని స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో వచ్చి నిధుల్ని గోవా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించినట్టు వివరించింది. కొంత మందికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడంతో పాటు వాళ్ల నుంచి కేజ్రీవాల్‌ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు చెప్పింది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉన్న సౌత్‌ గ్రూప్ నుంచి కేజ్రీవాల్‌ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపింది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Pawan Gifted Property To Children: విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Priya Bhavani Shankar Marriage: పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవాని శంకర్..
పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవాని శంకర్..
Embed widget