Territorial Army: భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం - రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ - ఈ దళాల ప్రత్యేకత తెలుసా?
India Pakistan Conflict : 14 బెటాలియన్ల టెరిటోరియల్ ఆర్మీని కూడా ఉపయోగించుకునేందుకు ఆర్మీ చీఫ్ కు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది.

Defence Ministry Activates Territorial Army: పాకిస్తాన్ విషయంలో భారత్ ఏ చిన్న విషయాన్ని లైట్ తీసుకోకుండా గట్టిగా కొట్టాలని డిసైడ్ చేసుకుంది. తాజాగా టెరిటోరియల్ ఆర్మీని కూడా యాక్టివేట్ చేశారు. ఉత్తర, పశ్చిమ , తూర్పు కమాండ్‌లలో మోహరించడానికి, వ్యూహాత్మకంగా బలోపేతం అవడానికి, యుద్దానికి సిద్ధం కావడానికి టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 14 పదాతిదళ బెటాలియన్‌లను పిలవడానికి ఆర్మీ చీఫ్‌కు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది. “టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948లోని రూల్ - 33 ద్వారా అధికారాలను వినియోగించుకోవడానికి, టెరిటోరియల్ ఆర్మీలో చేరిన ప్రతి అధికారిని , ప్రతి వ్యక్తిని అవసరమైన రక్షణ కోసం పిలవడానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్‌కు అధికారం ఉంది” అని ప్రభుత్వం తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
"Central Government empowers the Chief of the Army Staff to exercise the powers.. call out every officer and every enrolled person of the Territorial Army to provide for essential guard...'#IndiaPakistanWar #IndianArmy #Pahalgam #OperationSindoor2
— DW Samachar (@dwsamachar) May 9, 2025
Reads Indian Govt Gazette… pic.twitter.com/CVAl9VhCr8
భారత రక్షణ దళం (1917–1920), భారత భూభాగ దళం (1920–1948) లకు తోడు 1948 నాటి టెరిటోరియల్ ఆర్మీ చట్టం ద్వారా ఈ టెరిటోరియల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. టెరిటోరియల్ ఆర్మీ కి మూడు నక్షత్రాల ర్యాంక్ డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. సాధారణంగా భారత సైన్యం నుండి నియమించే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకింగ్ అధికారి, రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు.
టెరిటోరియల్ ఆర్మీ రెండు యూనిట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) , భారత రైల్వే , మాజీ సైనికుల ఉద్యోగులతో కూడిన డిపార్ట్‌మెంటల్ యూనిట్ . అలాగే ప్రైవేట్‌గా పనిచేసే పౌరులతో కూడిన నాన్-డిపార్ట్‌మెంటల్ యూనిట్. 1962 నాటి చైనా-భారత యుద్ధం , 1965 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం , 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం మరియు కార్గిల్ యుద్ధంతో సహా దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి భారతదేశం జరిగిన అన్ని యుద్ధాలలో టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది .
శ్రీలంకలో ఆపరేషన్ పవన్ (1987) , పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లలో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో (1991) మరియు ఆపరేషన్ బజరంగ్ (1990–1991) , జమ్మూ కాశ్మీర్‌లో ఆపరేషన్ పరాక్రమ్‌లలో కూడా ఈ ఆర్మీ పాల్గొంది . TAలో చేరాలనుకునే వ్యక్తులు ప్రధాన పౌర వృత్తులలో ఉద్యోగం పొంది ఉండాలి లేదా స్వయం ఉపాధి పొంది ఉండాలి. టెరిటోరియల్ ఆర్మీ "పూర్తి సమయం వృత్తిని అందించదు" అని పేర్కొన్నప్పటికీ, సైనికులు ఎక్కువ కాలం ఫిట్ నెస్ తో ఉండాలి. TA సిబ్బంది భారత సైన్యానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలకు అర్హులు. అయితే గ్రాట్యుటీ , పెన్షన్ మాత్రం ఐదు ఏళ్ల సర్వీస్ తర్వాత నిర్ణయిస్తారు.





















