అన్వేషించండి

భారత్ మాల్దీవ్స్ మధ్య కీలక సమావేశం, విభేదాలు పక్కన పెట్టినట్టేనా?

India Maldives Row: మాల్దీవ్స్ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

India Maldives Tensions:

జైశంకర్‌ భేటీ..

భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు (India Maldives Row) కొనసాగుతున్న క్రమంలోనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని కంపాలాలో ఈ సమావేశం జరిగినట్టు జైశంకర్ వెల్లడించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. భారత్, మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చ జరిగినట్టు వివరించారు. రెండు రోజుల పాటు జరిగే Non-Aligned Movement (NAM) సమ్మిట్‌లో పాల్గొనేందుకు కంపాలా వెళ్లిన జైశంకర్...జమీర్‌తో ప్రత్యేకంగా చర్చించారు. 

"మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో కంపాలాలో సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై చర్చించాం. దీంతో పాటు NAM కి సంబంధించిన చర్చలూ జరిపాం"

- ఎస్‌ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

స్పందించిన మూసా జమీర్‌ 
 
ఈ ట్వీట్‌కి మూసా జమీర్ స్పందించారు. జైశంకర్‌ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. X వేదికగా పోస్ట్ పెట్టారు. మాల్దీవ్స్‌లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాల్సిన అంశంపైనా చర్చించినట్టు తెలిపారు. తమ దేశానికి అందించాల్సిన సహకారంపైనా చర్చ జరిగినట్టు చెప్పారు. 

"భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అవడం ఆనందంగా ఉంది. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. మాల్దీవ్స్‌లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాలన్న అంశాన్ని ప్రస్తావించాను. అంతే కాకుండా మాల్దీవ్స్‌లో పెండింగ్‌లో డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసేందుకు తోడ్పడాలని కోరాను. SAARC, NAM లో సహకరించాలని విజ్ఞప్తి చేశాను. మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం"

- మూసా జమీర్, మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ చైనా పర్యటన ఈ అలజడిని మరింత పెంచింది. దాదాపు ఐదు రోజుల పాటు అక్కడే పర్యటించిన ముయిజూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది చిన్న దేశమే అన్న చిన్న చూపు చూడొద్దని, అలాంటి కవ్వించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అయితే...భారత్‌ పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే పరోక్షంగా భారత్‌ గురించే ఈ కామెంట్స్ చేశారన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.

"మాది చూడడానికి చిన్న దేశమే కావచ్చు. అలా అని మమ్మల్ని కవ్వించే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ చిన్న చూపు చూడాల్సిన పని లేదు. మా దేశాన్ని మేము అతి పెద్ద ఎకనామిక్‌ జోన్‌గా చూస్తున్నాం. మా చుట్టూ ఉన్న సముద్రం మాదే. అది వేరే ఏ దేశానికీ చెందినది కాదు. మేం ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. మాకు ఎవరి అండా అవసరం లేదు. మాదో స్వతంత్ర ప్రాంతం"

- మహమ్మద్ ముయిజూ, మాల్దీవ్స్ అధ్యక్షుడు

Also Read: Coaching Centres: శిక్షణ సంస్థల మోసాలకు చెక్, మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Embed widget