By: Ram Manohar | Updated at : 09 Mar 2023 11:54 AM (IST)
భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే కచ్చితంగా జోక్యం చేసుకుంటామని అమెరికా నిఘా విభాగం స్పష్టం చేసింది.
India-China LAC Clash:
గమనిస్తున్న అమెరికా..
భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో ఇంకా అలజడి కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇటు భారత్ మాత్రం యుద్ధ వాతావరణమే వస్తే దీటుగా బదులిస్తామని గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలోనే యూఎస్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కీలకంగా మారింది. భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. Annual Threat Assessment పేరిట ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది అమెరికా జాతీయ నిఘా విభాగం. ఆ రెండు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించింది.
"భారత్, చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ 2020లో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని నిశితంగా గమనిస్తున్నాం. అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఏ కాస్త పరిస్థితులు అదుపు తప్పినా అది అమెరికాకు కూడా చేటు చేస్తుంది. అలాంటి సమయంలో అమెరికా జోక్యం చేసుకోక తప్పదు. క్రమంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ముదిరేలా కనిపిస్తోంది"
- అమెరికా నిఘా విభాగం
పాకిస్థాన్‌పై వ్యాఖ్యలు..
అమెరికా తమ ప్రజల్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిస్తుందని ఈ రిపోర్ట్‌లో తేల్చి చెప్పింది ఇంటిలిజెన్స్. అటు భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాన్నీ ప్రస్తావించింది. కశ్మీర్‌లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ సంక్షోభం ఇంకా ముదిరే అవకాశముందని అంచనా వేసింది. అయితే..యాంటీ ఇండియా మిలిటరీ గ్రూప్స్‌కు పాకిస్థాన్ మద్దతునిస్తోందని, కానీ మోదీ పాలనలో ఎలాంటి దాడులకు పాల్పడాలని చూసినా...ఎదురు దాడులు తప్పవని స్పష్టం చేసింది.
"యాంటీ ఇండియా మిలటరీ గ్రూప్స్‌కు మద్దతుగా ఉండే చరిత్ర పాకిస్థాన్‌ది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మాత్రం భారత్ గతంలోలా లేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా వెంటనే మిలిటరీతో గట్టి బదులు ఇస్తుంది. కానీ కశ్మీర్‌లో మరోసారి అశాంతి చెలరేగే ప్రమాదముంది"
- అమెరికా నిఘా విభాగం
స్పై బెలూన్స్ కలకలం..
అమెరికా ఎయిర్ బేస్‌లో అనుమానాస్పద వస్తువులు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా వాటిని పేల్చేస్తోంది అగ్రరాజ్యం. ఇది కచ్చితంగా చైనా పనే అని తేల్చి చెబుతోంది. నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండి పడుతోంది. ఈ ఆరోపణలపై స్పందించిన డ్రాగన్..కౌంటర్ ఇచ్చింది. అమెరికా తమ ఎయిర్‌బేస్‌లోకి స్పై బెలూన్‌లు పంపుతోందని ఆరోపించింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 10 బెలూన్స్‌ను గుర్తించామని వెల్లడించింది. అమెరికా అక్రమంగా తమ ఎయిర్‌బేస్‌లోకి బెలూన్‌లు పంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నుంచే ఈ నిఘా మొదలైందని...ఇప్పటి వరకూ 10 కన్నా ఎక్కువగా స్బై బెలూన్‌లు పంపిందని చెప్పింది. చైనా అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇప్పటికే అమెరికా-చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. నిత్యం ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి ఇరు దేశాలు. అగ్రరాజ్యం అనే బిరుదు కోసం చైనా తపిస్తోంది. అమెరికాను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: Delhi Excise Policy Case: తీహార్ జైలుకు ఈడీ అధికారులు, సిసోడియాపై ప్రశ్నల వర్షం!
5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు
ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!