By: Ram Manohar | Updated at : 17 Dec 2022 04:22 PM (IST)
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. (Image Credits: ANI)
India China Clash:
తవాంగ్‌లో కట్టుదిట్టమైన భద్రత..
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. భారత్, చైనా సైన్యానికి మధ్య ఘర్షణ జరిగిన తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యంతో ఫోటోలు దిగారు. వాటినే సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ధైర్యసాహసాలు కలిగిన భారత సైన్యం పహారాలో తవాంగ్ ప్రాంతం చాలా సురక్షితంగా ఉంది" అని పోస్ట్ చేశారు. తరవాత వరుసగాకాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు. ఆయనను విమర్శిస్తూ వరుస ట్వీట్‌లు చేశారు. "మన సైన్యాన్ని చైనా వేధిస్తోంది. మన భూభాగాన్నీ ఆక్రమిస్తోంది. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉంది" అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. "రాహుల్ గాంధీ సైన్యాన్ని కించపరచడమే కాదు. దేశ ప్రతిష్ఠనూ దిగజార్చుతున్నారు" అంటూ ఫైర్ అయ్యారు. అంతే కాదు. రాహుల్ గాంధీ దేశానికి ఓ పెద్ద సమస్యగా మారాడంటూ విమర్శించారు. "రాహుల్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు. మొత్తం దేశానికే సమస్యగా మారారు. మన దేశ సైన్యాన్ని చూసి ఎప్పుడూగర్విస్తాం" అని స్పష్టం చేశారు.
Yangtse area in Tawang, Arunachal Pradesh is fully secured now due to adequate deployment of the brave jawans of Indian Army. pic.twitter.com/PVrW7usMyn
— Kiren Rijiju (@KirenRijiju) December 17, 2022
Rahul Gandhi is not only insulting Indian Army but damaging nation's image. He is not only a problem for the Congress Party but he has also become a huge embarrassment the country.
— Kiren Rijiju (@KirenRijiju) December 17, 2022
We are proud of our Armed Forces. pic.twitter.com/F6i8IScVHo
బీజేపీ కౌంటర్లు..
బీజేపీ ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు. "ఇది నెహ్రూ కాలం నాటి ఇండియా కాదు. చైనా మన దేశ భూభాగంలో 37,242 చదరపు కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చి ఆక్రమించినా అప్పుడు చలించలేదు. అప్పుడు ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది" అని విమర్శించారు. భారత సైన్యాన్ని కించపరిచారంటూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే
మోడీ సర్కార్ నిద్రపోతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఇలా బదులిచ్చారు. "భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ భారత సరిహద్దు ప్రాంతాల్లోని భద్రత గురించి చాలా మాట్లాడారు. దేశ పౌరుల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత సైన్యాన్నీ కించ పరుస్తున్నారు. నెహ్రూ కాలం నాంటి ఇండియా కాదిది" అని ఘాటుగా స్పందించారు.
Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం, బాధితురాలి పిటిషన్‌లు కొట్టివేత
Stocks to watch 02 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదరగొట్టిన Britannia, Tata Chem
YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల వ్యాఖ్యలు
Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి
ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?