Independence Day 2022 : మనకు తెలియని మన స్వాతంత్య్ర యోధులు - ఎంత మంది తెలుగు వీరులో తెలుసా ?
భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారు ఎందరో ఉన్నారు. తెలుగు వారు కూడా ఉన్నారు. చాలా మందికి తెలియని స్వాతంత్ర్య సమరయోధుల వివరాలుఇవీ ..!
Independence Day 20222 : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. కానీ ఈ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం అంత కంటే ఎక్కువే. ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది తెలుగువారు తమ పోరాడారు. తాము సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ అలాంటి వారి గురించి చాలా తక్కువగా ప్రపంచానికి తెలిసింది. అలాంటి కొంత మంది గురించి ఇప్పుడు మనంతెలుసుకుందాం !
ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు !
స్వాతంత్ర్య సమరయోధుల్లో ఎంతో మందితెలుగువారున్నారు. కానీ బయట ప్రపంచానికి తెలిసిన వారు కొందరే. అలాంటి వారిలో ఎం.సుబ్బారావు, నల్లంశెట్టి శ్రీరాములు , మాడభూషి శ్రీనివాసాచార్యులు బి.మునుస్వామి వంటి వారు వివిధ రూపాల్లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వీరందరూ తిరుపతికి చెందినవారు. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. అనలూరు రంగస్వామి అయ్యంగారు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని వేలూరు, కడలూరు, మద్రాసు జైళ్లలో సంవత్సర కాలం పాటు శిక్షను అనుభవించారు. సి.వి.రంగన్నశెట్టి నారాయణపురానికి చెందిన ఈయన ఒక సంవత్సరం పాటు వేలూరు, కడలూరు జైళ్లలో శిక్షను అనుభవించారు. కె.బి.రామనాథ్ తిరుచిరాపల్లె జైళ్లలో శిక్ష అనుభవించారు. మదార్ సాహేబ్ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని వేలూరు, కడలూరు జైళ్లలో ఏడాది కాలం పాటు శిక్ష ను అనుభవించారు.
పూడిపెద్ది సుందర రామయ్య !
మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ హటావో, ఖాదీ ఉద్యమం తదితర ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని, జైలుకి వెళ్లి, లాఠీ దెబ్బలు కూడా తిన్న ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలో కనుమరుగయ్యారు. అలాంటి వారిలో పూడిపెద్ది సుందరరామయ్య ఒకరు. ఆయన 12–8–1912న విశాఖపట్నంలో జన్మిం చారు. 1982 సెప్టెంబర్ 23న, తన 70వ ఏట కన్నుమూశారు. ఆయన గురించి ఇప్పటికీ పెద్దగా సమాచారం తెలియదు. 1929లో గాంధీగారి పిలుపుమేరకు, న్యాయశాస్త్రంలో పట్టా కోసం జరిగే పరీక్షలను సైతం వదులుకుని, అతి పిన్న వయసులోనే, అనగా తన 17వ ఏటనే, స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా గుర్తింపు పొందారు.
శాసనోల్లంఘన ఉద్యమంలో తెలుగువారు కీలకం !
బ్రిటీషు ప్రభుత్వం లక్ష్యపెట్టకపోతే శాసనోల్లంఘనకు దిగుతామంటూ 1930 జనవరి 31న హెచ్చరించారు. దీనికి అనుగుణంగానే మార్చిలో శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది. విదేశీ వస్తు బహిష్కరణ, పన్నులు కట్టకుండా నిరాకరణ, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, సారా వేలం పాటల బహిష్కరణ వంటి కార్యక్రమాలు దేశమంతా జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం ఈ ఉద్యమంలో భాగంగానే జరిగింది. ఉద్యమాన్ని అణచేయడానికి వేలాది మందిని జైళ్లలోకుక్కారు. పోలీసు కాల్పుల్లో వందలాది మంది మరణించారు. రెండు దశలుగా సాగిన ఈ మహోద్యమంలో కొన్ని వందల మంది పాల్గొన్నారు.
గుర్తింపు తెచ్చుకున్న యోధులు ఎంతో మంది !
భారత దేశంలో బ్రిటిష్ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ...మన్యం ప్రాంతంలోని గిరిజనులను చైతన్య పరచి సమీపంలోని అన్ని పోలీసుస్టేషన్లపై దాడులు చేసి, రెండు సంవత్సరాలపాటు బ్రిటిషు వారిని ముప్పుతిప్పలు పెట్టి చివరికి స్వరాజ్యం కోరకు అమరుడయ్యాడు. స్వాంతంత్య్ర పోరాటంలో తెలుగు వీరుడు అంటే అందరికి గుర్తుండే పేరు అల్లూరి.. మన భారత జాతికి పతాకాన్నిఅందించిన మహనీయుడు పింగళి వెంకయ్య . అయితే ఇంకా తెలియని వీరులు ఎందరో ఉన్నారు. చరిత్రకారులు చెబితే తప్ప మనం తెలుసుకోలేం.