By: ABP Desam | Updated at : 08 Feb 2023 01:13 PM (IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు పంజాబ్ కు చెందిన గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఓ డిస్టిలరీ కంపెనీైకి డైరెక్టర్‌గా గౌతమ్ మల్హోత్రా ఉన్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ఉదయం సీబీఐ అరెస్ట్ చేయగా.. కొన్ని గంటల్లోనే మరొకరిని ఈడీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా.. పలువురు మద్యం వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందని ఈడీ గుర్తించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వరుసగా అరెస్టులు
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సీబీఐ సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా, బినోయ్ బాబు, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబులను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కంపెనీలకు,వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేసినందుకు గాను 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు విజయ్ నాయర్ ద్వారా ఇచ్చినట్లు నిందితులపై ఆరోపణలున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ పాలసీ ముడుపులను ఖర్చు చేసినట్లు ఇటీవల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పేర్కొంది ఈడీ. ఈ క్రమంలో వరుసగా అరెస్టులు చేస్తూండటం కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి ఏర్పడింది.
కేజ్రీవాల్, సిసోడియా పాత్ర ఉందన్న ఈడీ
ఈడీ.. ఈ కేసులో నిందితులుగా సమీర్ మహేంద్రును(ఏ1), ఖావో గల్లి రెస్టారెంట్స్ ప్రైవేటు లిమిటెడ్(ఏ2), బబ్లీ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఏ3), ఇండోస్పిరిట్స్(ఏ4), ఇండోస్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(ఏ5), విజయ్ నాయర్(ఏ6), అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి(ఏ7), ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్(ఏ8), అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్(ఏ9), ఆర్గానమిక్స్ ఎకోసిస్టమ్స్ లిమిటెడ్(ఏ10), బినయ్ బాబు(ఏ11), పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఏ12), అభిషేక్ బోయినపల్లి(ఏ13), అమిత్ అరోడా(ఏ14), కేఎ్‌సజేఎం స్పిరిట్స్ ఎల్‌ఎల్‌పీ(ఏ15), బడ్డీ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏ16), పాపులర్ స్పిరిట్స్ ప్రైవేటు లిమిటెడ్(ఏ17)లను పేర్కొన్నది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవిత పేర్లను నిందితుల జాబితాలో చేర్చకున్నా.. ఈ స్కామ్‌లో వారి పాత్ర ఉందంటూ ఈడీ తన చార్జిషీట్‌లో ప్రస్తావించింది. అందుకు సంబంధించి, నిందితుల వాంగ్మూలాల్లో వారి పేర్లున్నట్లు తెలిపింది.
సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లు ఆప్ కు లంచం ఇచ్చారంటున్న సీబీఐ, ఈడీ
ఆప్ నేతల తరఫున సౌత్‌గ్రూ్‌ప నుంచి రూ. 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్ నాయరేనని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూ్‌ప నిర్వాహకులు తాము చెల్లించిన ముడుపులను తిరిగి రాబట్టేందుకు ఇండోస్పిరిట్స్‌లో 65 శాతం వాటాలు ఇచ్చారు. సౌత్‌గ్రూ్‌ప పేరు బయటకు రాకుండా.. ఇండోస్పిరిట్స్ వాటాలను నియంత్రించారు. అరుణ్‌పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌ను బినామీలుగా వాడుకున్నారని ఈడీ చెబుతోంది. కవిత సూచన మేరకు అరుణ్ పిళ్లైకి రూ. కోటి ఇచ్చినట్లు ఆమె సన్నిహితుడు వి.శ్రీనివాస్ రావు వాంగ్మూలమిచ్చినట్లు ఈడీ స్పష్టం చేసింది. ముందు ముందు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం
Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!
Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా?
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?
Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?