అన్వేషించండి

IIT Bombay: రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్, విద్యార్థులకు రూ.లక్ష జరిమానా విధించిన ఐఐటీ

Ramayana Skit: రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్ వేసిన విద్యార్థులపై ఐఐటీ బాంబే ఫైర్ అయింది. ఒక్కొక్కరికీ రూ.లక్షకుపైగా జరిమానా విధించింది.

 Ramayana Skit in IIT Bombay: రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన 8 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు యాజమాన్యం భారీ జరిమానా విధించింది. మత విశ్వాసాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించినందుకు ఒక్కొక్కరికీ రూ.1.2 లక్షల ఫైన్ వేసింది. మార్చి 31వ తేదీన కాలేజ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కొంత మంది విద్యార్థులు Raahovan పేరుతో ఓ స్కిట్ వేశారు. రామాయణానికి ఇది పేరడీ. అయితే కొంత మంది విద్యార్థులు ఈ నాటకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలను దెబ్బ తీశారని మండి పడ్డారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఫిర్యాదు చేశారు. దీనిపై క్రమశిక్షణా కమిటీ తీవ్రంగా స్పందించింది. భారీ జరిమానాలు విధిస్తూ జూన్ 4వ తేదీన ఆదేశాలిచ్చింది. 8 మంది ఈ స్కిట్ వేయగా వాళ్లలో నలుగురికి రూ.1.2 లక్షల జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికీ రూ.40 వేల ఫైన్ వసూలు చేసింది. మరి కొన్ని ఆంక్షలూ విధించింది. హాస్టల్‌ నుంచి డిబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది యాజమాన్యం. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

ఏప్రిల్ 8వ తేదీన ఈ వివాదం రాజుకుంది. రామాయణానికి పేరడీ అని చెప్పి నాటకం వేశారు విద్యార్థులు. తమకు అనుకూలంగా మార్చుకుని అందులోని పాత్రల్ని అవమానించారని ఓ వర్గం ఆరోపించింది. ఈ స్కిట్‌కి సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీత పాత్ర వేసిన మహిళ తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పొగడడం, ఆమెని తీసుకెళ్లిన చోటు చాలా బాగుందని చెప్పడం లాంటివి కొందరికి అసహనం కలిగించాయి. 

Also Read: Tamil Nadu Hooch Tragedy: అలాంటి వాళ్లని ఊరికే వదిలే ప్రసక్తే లేదు - కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు సీఎం సీరియస్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget