News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

IBPS Clerk: ఐబీపీఎస్‌ క్లర్క్‌-సీఆర్‌పీ-XIII నోటిఫికేషన్‌, దరఖాస్తు చేసుకోండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌), 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-XIII నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌), 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-XIII నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి చర్యలు చేపట్టనుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. క్లర్క్ పోస్టులకు జులై 1 నుంచి జులై 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

వివరాలు...

* ఐబీపీఎస్‌ క్లర్క్‌-సీఆర్‌పీ-XIII 

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 20-28 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రిలిమినరీ పరీక్షను మూడు రోజులపాటు నిర్వహించనుండగా.. మెయిన్ పరీక్ష మాత్రం ఒకే రోజులో ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే  ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున.. గంట వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థి ప్రతి విభాగంలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ స్కోర్ దాటిన అభ్యర్థులను మాత్రమే ఖాళీలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.

మెయిన్ పరీక్ష: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు. వీరిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.
 
ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2023.

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 26.08.2023, 27.08.2023, 02.09.2023.

➥ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి: సెప్టెంబరు/అక్టోబరు 2023.

➥ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబరు/ అక్టోబరు, 2023.

➥ మెయిన్ పరీక్ష తేదీ(ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 07.10.2023.

➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

Notification

Online Application

Website

Also Read:

రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 140 ఖాళీలు, అర్హతలివే!
చెన్నైలోని నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని 'రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Jul 2023 02:36 PM (IST) Tags: IBPS Institute of Banking Personnel Selection online application process official website ibps crp clerk recruitment eligibility criteria and important dates clerk recruitment clerical cadre vacancies

ఇవి కూడా చూడండి

Telangana Election Results 2023 LIVE: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 'హస్తం' హవా - బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్

Telangana Election Results 2023 LIVE: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 'హస్తం' హవా - బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Winning Minister 2023: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే

Winning Minister 2023: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే

Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

Revanth Reddy News: కొడంగల్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి భారీ విజయం

Revanth Reddy News: కొడంగల్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి భారీ విజయం

Telangana Results 2023: అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం

Telangana Results 2023: అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం
×