Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
IAS : ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగాలనుకున్న ఐఏఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించలేదు. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
![Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు IAS officers Amarapali and othes did not get relief in the High Court Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/b67f10754c84b70ae3c8486449c3fb711729072484247228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IAS officers Amarapali and othes did not get relief in the High Court : ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ, తెలంగాణకు కేటాయించిన క్యాడర్ సివిల్ సర్వీస్ అధికారులకు హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు వెళ్లి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని సూచించింది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులే వీరి విషయంలోనూ వర్తిస్తాయని కేంద్రం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమ సొంత ప్రాంతాలను తప్పుగా నిర్దారించినందున తమ క్యాడర్ ను మార్చాలని కోరుతున్నారని అందుకే ముందస్తుగా ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఐఏఎస్‌ల తరపు న్యాయవాది కోరారు. అయితే ఐఏఎస్‌లు అయినంత మాత్రాన స్టే ఎలా ఇస్తామని కోర్టు ప్రశ్నించింది.
రిలీవ్ వేయాలంటే పది, పదిహేను రోజుల సమయం కావాలన్న ప్రభుత్వాలు
అయితే ఐఏఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఏఎస్‌లను ఇప్పటికిప్పుడు రిలీవ్ చేయడం కష్టమని కనీసం పదిహేనురోజుల సమయం ఉండాలని అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రిబ్యూనల్ కొట్టేస్తే హైకర్టుకు రావడం సరి కాదని కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్టు చేసిన తర్వాతనే పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. సివిల్ సర్వీస్ అధికారులు ఎక్కడ కేటాయిస్తే అక్కడకు వెళ్లి విధి నిర్వహణలో పాల్గొనాలన్నారు. వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ను రిజర్వ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేసిన తర్వాతనే విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేయడంతో కేటాయించిన క్యాడర్ రాష్ట్రానికి వెళ్లి రిపోర్టు చేాయల్సిన తప్పని పరిస్థితి ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏర్పడింది.
ముందు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయక తప్పని పరిస్థితి
తెలంగాణ నుంచి ఐఏఎస్‌లు ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సి ఉంది. వారిలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ కాట అమ్రపాలి కూడా ఉన్నారు. రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అలాగే ఏపీ నుంచి గరిమెళ్ల సృజన, శివశంకర్, హరికృష్ణ తెలంగాణలో రిపోర్టు చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అధికారులను ప్రత్యాష్ సిన్హా కమిటీ విభజించింది. యూపీఎస్సీ రికార్డుల ప్రకారం శాశ్వత నివాసం ఆధారంగా ఏపీ అయితే ఏపీకి..తెలంగాణ అయితే తెలంగాణకు కేటాయించారు. కొంత మంది కాట అమ్రపాలి తమ శాశ్వత అడ్రస్ ను విశాఖగా పేర్కొనడంతో ఆమెను ఏపీకి కేటాయించారు. ఇలాగే ఇతరుల్ని కేటాయించారు. కేటాయింపులపై అప్పట్లో క్యాట్ కు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకుని తమకు నచ్చిన రాష్ట్రాల్లో కొనసాగుతున్నారు.
గతంలో సోమేష్ కుమార్‌కూ అదే పరిస్థితి
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కమార్ కు కూడా ఏపీ క్యాడరే కేటాయించారు. ఆయనకు కూడా గతంలో కోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన సీఎస్ పదవి నుంచి వైదొలిగి ఏపీలో రిపోర్టు చేశారు. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అదే తీర్పు ప్రస్తుత ఐఎఎస్‌లకూ వర్తిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)