Joe Biden: మరోసారి నవ్వుల పాలైన బైడెన్, కెనడా పార్లమెంట్‌లో చైనాపై ప్రశంసలు - వైరల్ వీడియో
Joe Biden: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మరోసారి నవ్వుల పాలయ్యారు.
Joe Biden:
కెనడా పార్లమెంట్‌లో స్పీచ్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరచూ వార్తలో ఉంటారు. సంచలన నిర్ణయాలతో కాదు. స్పీచ్‌లతో. అవును. ఆయన ప్రసంగించిన ప్రతిసారీ ఏదో ఓ పొరపాటు చేస్తుంటారు. అది కాస్తా వైరల్ అవుతుంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. కెనడాకు బదులుగా చైనాను పొగిడి ఆ తరవాత వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు. అప్పటికే చుట్టూ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు. కెనడా పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలో జరిగిందీ ఘటన. అక్కడి వలస చట్టాల గురించి ప్రస్తావించారు బైడెన్. ఆ చట్టాలను ప్రశంసించే సమయంలో "కెనడా" పేరు బదులు "చైనా" పేరు ప్రస్తావించారు. వెంటనే తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. "క్షమించాలి. నేను చెప్పేది కెనడా గురించి. చైనా గురించి కాదు. చైనా విషయంలో నేనేం ఆలోచిస్తూ ఉంటానో మీకు తెలిసే ఉంటుంది." అంటూ తన వ్యాఖ్యల్ని సరి చేసుకున్నారు. కెనడా పార్లమెంట్ సభ్యులు ఇది విని గట్టిగా నవ్వారు. ఆ తరవాత బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. లాటిన్ అమెరికన్ దేశాల నుంచి వచ్చే 15వేల మంది వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తూ కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు బైడెన్. అక్రమ వలసలను ఇది నియంత్రిస్తుందని అన్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతోంది. బైడెన్‌ను చైనా వెంటాడుతోందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
BIDEN: "I applaud China..." pic.twitter.com/PJgxSanGCM
— RNC Research (@RNCResearch) March 24, 2023
గతంలోనూ...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్య కాలంలో తన ప్రవర్తనతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. చనిపోయిన మహిళ పేరుని పిలుస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు బైడెన్. గతేడాది జరిగిన ఓ మీటింగ్‌లో జరిగిందీ ఘటన. ఆ తరవాత మరో చోట ఇలాంటి ప్రవర్తనతోనే అందరినీ షాక్‌కు గురి చేశారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (FEMA)ఆఫీస్‌లో అందరితో మాట్లాడారు. హరికేన్ ఇయాన్ సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నందుకు FEMAను ప్రశంసించారు. ఈ స్పీచ్ పూర్తయ్యాక...ఉన్నట్టుండి పక్కకు వెళ్లారు బైడెన్. అక్కడి క్రౌడ్ వద్దకు వెళ్లి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. RNC Research అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. స్పీచ్ పూర్తిగా కాగానే థాంక్యూ అని వెంటనే కుడి వైపు తిరిగారు. పక్కనే ఉన్న ఫెమా అధికారి ఒకరు "మిస్టర్ ప్రెసిడెంట్" అని పిలుస్తూనే ఉన్నారు. అయినా...ఆమెను పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లారు బైడెన్. అందరికీ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. "ఇదెంతో బాధాకరం" అని కొందరు రెస్పాండ్ అవుతుంటే...మరి కొందరు ఇదేంటి అలా వెళ్లిపోతున్నాడంటూ కామెంట్ చేశారు.
"Mr. President.........?" pic.twitter.com/DOdTltF6g1
— RNC Research (@RNCResearch) September 29, 2022
Also Read: Rahul Gandhi: మోదీ కళ్లలో భయం కనిపించింది, జీవితాంతం జైల్లో పెట్టినా పోరాటం ఆపను - రాహుల్ గాంధీ