Viral News: భార్యతో అసహజ శృంగారం చేశాడని భర్తను శిక్షించలేం - ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Delhi High Court: భర్త తనతో బలవంతంగా అసహజ శృంగారం చేశాడని ఓ భార్య కోర్టుకెక్కింది. ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.

Husband canot be punished under Section 377 IPC for anal or oral: భార్యతో అసహజ లైంగిక చర్య (అనల్ లేదా ఓరల్ ) చేసినందుకు భర్తను భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 377 కింద శిక్షించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ ఇచ్చారు.
2023లో తన భర్త హనీమూన్ సమయంలో తనతో అసహజ శృంగారానికే ప్రాధాన్యం ఇచ్చాడని..వివాహ బాధ్యతను నెరవేర్చలేకపోయాడని ఓ భార్య పోలీసులుక ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్త తండిపై రేప్ , బావమరిదిపై శారీరక దాడి ఆరోపణలు కూడా చేసింది. దీనిపై ఢిల్లీ పోలీసులు భర్తపై సెక్షన్ 377, 376 (రేప్), 354, 354B, మరియు 323 IPC కింద కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు భర్తపై సెక్షన్ 377 కింద ఆరోపణలు ఖరారు చేసింది. కానీ ఇతర నిందితులను డిశ్చార్జ్ చేసింది. భర్త తనను దోషిగా ఖరారు చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
సెక్షన్ 377 IPC "అసహజ లైంగిక నేరాలను" ) నిర్వచిస్తుంది. అయితే, 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను పాక్షికంగా తొలగించి, సమ్మతితో కూడిన పెద్దల మధ్య లైంగిక చర్యలను నేరం కాదని తీర్పు ఇచ్చింది. అసమ్మతి లేని చర్యలు నేరంగా పరిగణిస్తారు. ఢిల్లీ హైకోర్టు, సెక్షన్ 375 IPC (రేప్) లోని ఎక్సెప్షన్ 2ని ఉటంకిస్తూ, వివాహంలో భార్య సమ్మతిని "ఊహించిన సమ్మతి" గా పరిగణిస్తుందని పేర్కొంది. ఈ ఎక్సెప్షన్ ప్రకారం, 18 ఏళ్లు పైబడిన భార్యతో భర్త లైంగిక సంబంధం పెట్టుకోవడం రేప్ కాదని తెలిపింది. ఈ ఎక్సెప్షన్ సెక్షన్ 377కి కూడా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. అంటే వివాహంలో అనల్ లేదా ఓరల్ వంటి చర్యలు కూడా ఈ రక్షణ కిందకు వస్తాయని తీర్పు ఇచ్చింది.
భార్య ఫిర్యాదులో ఒకవైపు భర్త లైంగిక అసమర్థతను ఆరోపిస్తూనే, మరోవైపు అసహజ శృంగారానికి పాల్పడ్డారని భార్య ఆరోపించింది. ఇది అస్పష్టతను సృష్టించింది. సెక్షన్ 377 కింద నేరం రుజువు కావాలంటే, సమ్మతి లేకపోవడం అనేది కీలక అంశం. ఈ కేసులో అలాంటి స్పష్టమైన ఆరోపణ లేనందున, ఆరోపణల్ని కొట్టి వేస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ట్రయల్ కోర్టు ఆరోపణలను రూపొందించిన ఆదేశాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ, సెక్షన్ 377 కింద భర్తపై ఎటువంటి ప్రాథమిక కేసు లేదని నిర్ధారించారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఫిబ్రవరి 2025న వివాహంలో అసమ్మతితో జరిగిన అసహజ లైంగిక చర్యలు సెక్షన్ 377 కింద నేరంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది.





















