అన్వేషించండి

Indian Muslims Wealth: భారత్‌లోని ముస్లింల ఆస్తుల విలువ ఎంత? వాళ్ల వద్ద ఎంత బంగారముంది?

Indian Muslims: భారత్‌లోని ముస్లింల వద్ద ఎంత ఆస్తి, బంగారం ఉందో 2020లో ఓ సంస్థ అధ్యయనం చేసి రిపోర్ట్ వెలువరించింది.

Indian Muslims Wealth Details: ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలోని ధనాన్నంతా కాంగ్రెస్ దోచుకుంటుందని, ఆ సంపదనంతా ముస్లింల చేతుల్లో పెట్టేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాని. కాంగ్రెస్ ఈ కామెంట్స్‌ని తీవ్రంగా ఖండిస్తోంది. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే మోదీపై మండి పడ్డారు. స్నేహితులకు దేశ సంపదనంతా దోచి పెట్టే ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. పరోక్షంగా అంబానీ, అదానీల గురించి ప్రస్తావించారు.

ఈ క్రమంలోనే అసలు దేశంలోని ముస్లింల ఆస్తుల (Wealth of Indian Muslims) లెక్కలెంత అన్న చర్చ జరుగుతోంది. 2020లో Indian Institute of Dalit Studies ఓ రిపోర్ట్ వెలువరించింది. ఈ నివేదికల్లోని లెక్కల ప్రకారం...భారతదేశ సంపదలో 41% మేర హిందువులదే వాటా అని తేలింది. ఇందులో కులాల వారీగా చూస్తే...హిందూ ఓబీసీల ఆస్తుల విలువ 31%గా ఉంది. అంటే ఎక్కువ మొత్తం వాళ్లదే. ఆ తరవాత ముస్లింలకు 8% ఆస్తులు, ఎస్సీలకు 7.3%, STలకు 3.7% మేర ఆస్తులు ఉన్నట్టు ఈ నివేదిక (Indian Muslims Wealth) వెల్లడించింది.

బంగారం ఎంతుంది..? 

ఇక కుటుంబాల వారీగా చూస్తే హిందువుల్లోని అగ్రవర్ణాల్లో తలసరి ఆస్తుల విలువ రూ.27.73 లక్షలుగా ఉంది. హిందూ ఓబీసీల్లో ఈ ఆస్తుల విలువ రూ.12.96 లక్షలుగా ఉన్నట్టు వెల్లడైంది. ముస్లిం కుటుంబాల్లో ఈ తలసరి ఆస్తుల విలువ రూ.9.95 లక్షలుగా ఉన్నట్టు తేలింది. అయితే..ఈ విషయంలో SC,STలో పోల్చుకుంటే ముస్లింలు కాస్తంత మెరుగ్గా ఉన్నట్టు రిపోర్ట్ తెలిపింది. మొత్తం ఆస్తుల విలువ చూస్తే దేశంలోని హిందువులకు (Wealth of Hindus in India) రూ.1,46,394 కోట్ల వరకూ ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

ముస్లింల ఆస్తుల విలువ రూ.28,707 కోట్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందువుల జనాభా 79.80%గా ఉండగా ముస్లింల జనాభా 14.23%గా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ఇక అసలు ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగారం విషయానికి వస్తే...హిందువుల్లోని OBCల వద్ద దేశంలోని బంగారం మొత్తంలో 39.1% మేర ఉంది. హిందువుల్లోని అగ్రవర్ణాల వద్ద 31.3% బంగారం ఉంది. ఇక ముస్లింల దగ్గర 9.2% మేర బంగారం ఉన్నట్టు వెల్లడించింది. అదే STల వద్ద ఇది కేవలం 3.4%గా ఉంది.

ప్రధాని మోదీ ఏమన్నారు..?

ప్రతిపక్ష కూటమిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఆ పార్టీ దేశంలోని అందరి మహిళల మంగళసూత్రాలతో సహా బంగారమంతా దోచుకుని ఆ సంపదను ముస్లింలకు పంచి పెడుతుందని ఆరోపించారు. రాజస్థాన్‌లో ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. అంతే కాదు. ఓ వ్యక్తి చనిపోయిన తరవాత కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని LIC లో జరిగిన అవతకవతల్ని ప్రస్తావిస్తూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూస్తుంటే మోదీ కాంగ్రెస్‌పై డైరెక్ట్ అటాక్‌ మొదలు పెట్టారని అర్థమవుతోంది. 

Also Read: Tesla Layoffs: టెస్లా ఉద్యోగులకు లేఆఫ్‌ల టెన్షన్, వేలాది మంది తొలగింపు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget