ABP CVoter Opinion Poll: ఆ రెండు రాష్ట్రాలు మళ్లీ భాజపావేనా? ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏం చెబుతోందంటే?
HP ABP CVoter Opinion Poll: హిమాచల్ ప్రదేశ్,గుజరాత్‌లో మరోసారి భాజపా గెలిచే అవకాశముందని ఏబీపీ సీ ఓటర్ సర్వే తెలిపింది.
![ABP CVoter Opinion Poll: ఆ రెండు రాష్ట్రాలు మళ్లీ భాజపావేనా? ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏం చెబుతోందంటే? Himachal Pradesh ABP CVoter Opinion Poll: BJP Likely To Retain Hill State? See What Early Projections Say ABP CVoter Opinion Poll: ఆ రెండు రాష్ట్రాలు మళ్లీ భాజపావేనా? ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏం చెబుతోందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/6ca6eee460ce06c8fb0cb828e9c5a5531664713700441517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
HP ABP CVoter Opinion Poll:
గుజరాత్‌లో ఇలా..
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది. ఈ పోల్‌లో గుజరాత్‌లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. ఇప్పుడు ఏడోసారి కూడా గెలుస్తుందని ఈ పోల్‌లో తేలింది. 135-143సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఆప్ రేసులోకి రావడం వల్ల భాజపా, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోతుందని తెలిపింది. భాజపాకు 46.8%, కాంగ్రెస్‌కు 32.3%, ఆప్‌నకు 17.4% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది ABP News,C Voter Opinion Poll 2022. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 36-44 సీట్లు వస్తాయని, ఆప్ సున్నా లేదంటే 2 సీట్లు మాత్రమే సాధించే అవకాశముందని వెల్లడించింది.
హిమాచల్‌లో అలా..
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన ముగియనుంది. 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ABP News,C Voter సర్వే ఒపీనియన్ పోల్ రిజల్ట్స్‌తో ముందుకొచ్చింది. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి..? ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశముంది..? అనే విషయాలు అంచనా వేసింది.
ABP News-CVoter Opinion Poll 2022 ప్రకారం...2017తో పోల్చి చూస్తే..హిమాచల్‌లో భాజపా ఓటు షేర్ కాస్త తగ్గనుంది. ఈ ఏడాది ఓటు షేర్ 45.2%గా ఉండగా...2017లో ఇది 48.8%గా నమోదైంది. ఇక మిగతా పార్టీల సంగతి చూస్తే...కాంగ్రెస్ ఓటు శాతం 33.9%గా అంచనా వేసింది. గత ఎన్నికలతో పోల్చితే...ఇది 8% తక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓట్ షేర్ 9.5%గా నమోదవుతుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం... భాజపానే మరోసారి అధికారంలోకి రానుంది. కాషాయపార్టీ 37-45 సీట్లు సాధిస్తుందని ABP-C Voter సర్వే స్పష్టం చేసింది.
జైరామ్ ఠాకూర్‌కే మద్దతు..?
కాంగ్రెస్‌కు 21-29 స్థానాలు వచ్చే అవకాశముంది. ఆప్ కేవలం ఒక్క సీట్‌కే పరిమితం కావచ్చని వెల్లడించింది. ఇక సీఎం అభ్యర్థిగా మరోసారి జైరామ్ ఠాకూర్ ఉండాలా లేదా అన్న విషయంలోనూ సర్వే జరిగింది. ఇందులో 31.7% మంది జైరామ్ ఠాకూర్‌కు మద్దతుగా నిలిచారు. ఇక రెండో అభ్యర్థిగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేరు వినిపించింది. ఆయనకు 19.5% ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి రేసులో మూడో అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు 15% మంది మద్దతు పలికారు. 9.5% మంది ఆప్‌నకు చెందిన అభ్యర్థే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని ABP News, C Voter సర్వే వెల్లడించింది.
మోదీకి సరైన ప్రత్యర్థి ఎవరు..?
2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ భాజపా సహా ప్రతిపక్షాలన్నీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసరగలరా? లేక మోదీకి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సరైన ప్రత్యర్థా? ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరి మదిలో మెదులుతోంది. అయితే ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు C-ఓటర్.. ABP న్యూస్ కోసం ఒక క్విక్ సర్వే నిర్వహించింది. దీనిలో ప్రజలు ఈ ప్రశ్నకు చాలా ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. 2024లో ప్రధాని మోదీకి అతిపెద్ద సవాల్ ఎవరు? కేజ్రీవాల్ లేదా నితీశ్? అని ప్రజల్ని ప్రశ్నించింది C-ఓటర్. కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి సవాల్‌గా నిలుస్తారని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి నితీశ్ కుమార్ సరైన ప్రత్యర్థి అని 35 శాతం మంది తెలిపారు.
Also Read: Gandhi Jayanti 2022: ఐరాసలో ప్రత్యేక అతిథిగా మహాత్ముడు- ఆకట్టుకున్న ప్రసంగం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)