Gandhi Jayanti 2022: ఐరాసలో ప్రత్యేక అతిథిగా మహాత్ముడు- ఆకట్టుకున్న ప్రసంగం!
Gandhi Jayanti 2022: ఐక్యరాజ్యసమితిలో మహాత్మా గాంధీ ప్రత్యేక అతిథిగా కనిపించారు. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.
Gandhi Jayanti 2022: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కేవలం భారత్‌లోనే కాకుండా పలు దేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కన్పించడం విశేషం.
ఇదీ సంగతి
యునెస్కో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను శుక్రవారం ఐరాసలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహింసా లెక్చర్ సిరీస్ సందర్భంగా ఐరాసకు భారత ప్రతినిధి బృందం.. గాంధీజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించింది.
Glimpses from the fifth #Ahinsa lecture on Education and Human #flourishing in commemoration of #nonviolence day in collaboration with the Permanent Mission of India to the UN at the UN Headquarters. Watch full recording here https://t.co/xUIm4zDpwl pic.twitter.com/JXyH4gmbs0
— unesco_mgiep (@UNESCO_MGIEP) October 2, 2022
ఈ హోలోగ్రామ్‌ను హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ డిజిటల్ మ్యూజియం రూపొందించింది. ఇది గాంధీజీ హోలోగ్రామ్‌లో రెండో ఎడిషన్ అని ఈ మ్యూజియం డైరెక్టర్ బిరాడ్ యాజ్నిక్ తెలిపారు. డిజిటల్ గ్రాఫిక్ ఫైల్స్‌ను సంగ్రహించి వాటిని మోషన్ గ్రాఫిక్స్‌తో కలిపామని, దీంతో హోలోగ్రామ్ స్క్రిప్ట్‌ను చదివేలా చేశామన్నారు.
ఆ హోలోగ్రామ్‌ను చూడగానే అచ్చం జాతిపితే సమావేశాలకు వచ్చారనే భావన కలిగింది. ఈ హోలోగ్రామ్‌కు ఉన్న వాయిస్ ఓవర్.. విద్యపై మహాత్ముడి అభిప్రాయాలను పంచుకుంది. దీంతో గాంధీజీ స్వయంగా మాట్లాడుతున్నట్లు కన్పించింది.
నివాళులు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
Paying homage to Mahatma Gandhi on #GandhiJayanti . This Gandhi Jayanti is even more special because India is marking Azadi Ka Amrit Mahotsav. May we always live up to Bapu’s ideals. I also urge you all to purchase Khadi and handicrafts products as a tribute to Gandhi Ji. pic.twitter.com/pkU3BJHcsm
— Narendra Modi (@narendramodi) October 2, 2022
Also Read: Mulayam Singh Yadav's Health: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు సీరియస్- ఐసీయూలో చికిత్స!